Breaking News

వైకే యాంటిక్‌  హోం మ్యూజియం: అబ్బురం, అద్భుతం

Published on Wed, 01/22/2025 - 15:14

గతమెంతో ఘనం.. నేడు జీవనమే గగనం..అనే నానుడి అందరికీ తెలిసిందే..నగరంలోని వైకే యాంటిక్‌  హోంలో ఏర్పాటు చేసిన మ్యూజియం చూస్తే ఇదే అక్షర సత్యం అని అనిపించక మానదు.. మన పూర్వీకులైన తల్లిదండ్రులు, తాత ముత్తాతల జీవన శైలి మనకు అబ్బురంగానూ.. అద్భుతంగానూ అనిపిస్తుంది.. నేటి ఆదునిక పోకడలు అనారోగ్యాలు తెచ్చిపెడుతోంటే.. నాటి జీవన శైలివైపుకే మరలా అడుగులు పడు తున్నాయి..  వంట పాత్రల నుంచి ఆహార పదార్థాల వరకూ కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే నానుడి నుంచి.. ఆ పాత మధురం.. అనే రీతిలో నేటి తరం జీవన శైలి మారుతోంది.. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలకు ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం..   – సాక్షి, సిటీబ్యూరో

మన పూర్వీకులు వంట చేసుకోవడం మొదలుకుని తినడానికి వాడే గిన్నెలు, ప్లేట్లు, పాత్రలు, సంగీత పరికరాలు, పెద్ద పెద్ద శబ్ధాలు చేసే పరికరాలు.. ఇలా అన్నీ ఒకే చోట కనువిందు చేస్తే.. ఆ ప్రాంతం నుంచి వెనిక్కి రావడానికి మనుసు ఒప్పుకోదు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి సికింద్రాబాద్‌లోని వైకే యాంటిక్‌ హోం మ్యూజియం. పిల్లలకు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయడం, పూర్వీకుల జీవన విధానంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో తోడ్పడతాయి. 

దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలంలో వినియోగంలో ఉన్న వస్తువుల నుంచి 20వ శతాబ్దం వరకూ అప్పటి జీవన విధానంలో వినియోగించిన అనేక పరికరాలు, వస్తువుల, ఆయుధాలు ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. మన పూర్వీకులకు చెందినవే కాకుండా ఇతర దేశాలకు చెందిన పలు రకాల చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ఇక్కడ సందర్శనకు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మ్యూజియంలోకి అనుమతిస్తారు. 9963822339 లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 

తొలుత పది వస్తువులతో
మాది కాకినాడకు సమీపంలోని సోమేశ్వరం. కుటుంబాన్ని చెన్నైకి తరలించే క్రమంలో మా అమ్మ పురాతన వస్తువులను వెంట తెచ్చుకుంది. వాటిని చూసినవారు చాలా బాగున్నాయని ప్రశంసించేవారు. దీంతో ఇలా అందరికీ మధురజ్ఞాపకాలను అందించే వస్తువులను సేకరించాలని నిర్ణయించుకున్నా. 50 ఏళ్ల నుంచి సికింద్రాబాద్‌లోని లోతుకుంటలో ఇంటినే మ్యూజియంగా మార్చాను. తొలుత 10 వస్తువులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం వెయ్యికిపైగా వస్తువులకు చేరింది. – వై.కృష్ణమూర్తి, మ్యూజియం  నిర్వాహకులు 

అమ్మ గుర్తుకొచ్చింది
మేం చిన్నప్పటి నుంచి వినియోగించే చాలా రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్నానాలకు నీరు వేడిచేసే పాత్ర, పచ్చడి పెట్టుకునే పింగాణీ కుండలు, కంచు, ఇత్తడి సామాగ్రిని చూసిన వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. కాలంతో పాటు పాత్రలు మారిపోతున్నాయి. – సుభాషిణి, బేగంపేట్‌ 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)