Breaking News

సంక్రాంతి వస్తోంది! ఈ వేడుకల గురించి తెలుసా?

Published on Mon, 12/09/2024 - 10:05

సంక్రాంతి పండుగ వస్తోందంటే గ్రామాలకు ప్రయాణం మొదలవుతుంది. సొంతూరికి వెళ్లే వాళ్ల ఆనందం అన్నింటికంటే మిన్న. అలాగే హైదరాబాద్‌వాసులు శిల్పారామంలో నిర్వహించే వేడుకలతో ఆనందిస్తారు. గాలిపటాలతో గాల్లో తేలినట్లు సంతోషిస్తారు. ఇది మన తెలుగు సంక్రాంతి. ఇక తమిళులు సంక్రాంతిని దేశానికే తలమానికం అన్నట్లు నిర్వహించుకుంటారు. కళారంగం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా సొంత రాష్ట్రానికి వస్తారు. మైలాపోర్‌ వేడుకల్లో  పాల్గొని సంతోషాన్ని మది నిండా నింపుకుని తిరిగి వెళ్తారు. 

మైలాపోర్‌ వేడుకలు
తెలుగువాళ్లలాగే తమిళనాడుకి సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వేడుకల వాతావరణం నెలకొంటుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏటా ఆర్ట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. మైలాపోర్‌లో జరుగుతుంది కాబట్టి దీనికి మైలా΄ోర్‌ ఫెస్టివల్‌ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఏటా సంక్రాంతి ముందు జరిగే ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి. గడచిన 72 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో 30కి పైగా కళలను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందలకు పైగా కళాకారులు పాల్గొంటారు. నాట్యప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాము గారడీ నుంచి జానపద కళారూపాల ప్రదర్శనలతో నగరం కళకళలాడుతుంది. అన్నింటిలోకి ముగ్గుల పోటీ ప్రత్యేకం. ముగ్గును కోలామ్‌ అంటారు. ఇందులో మహిళలతోపాటుబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.

 ఇంకా ఏమేమి  ఉంటాయి?

ప్రాచీన కపాలి ఆలయానికి హెరిటేజ్‌ వాక్, తె΄్పోత్సవం, మాడవీథుల్లో పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సైక్లింగ్‌ టూర్‌లో టీనేజ్‌ నుంచి యువకులు ఉత్సాహంగా కనిపిస్తారు. బోట్‌ షికార్, ఫుడ్‌ వాక్, చిల్డ్రన్‌ టూర్‌... ఇలా థీమ్‌ ప్రకారం వేడుకలు సాగుతాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ మైలాపోర్‌ ఫెస్టివల్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)