Breaking News

Suicide Plant: మొక్కే కదా అని ముట్టుకుంటే ప్రాణాలు పోతాయి..

Published on Thu, 07/13/2023 - 12:21

పచ్చని చెట్లు చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్ల మధ్య కాసేపు గడిపితే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వచ్చమైన గాలిని అందిస్తూ మేలు చేసే చెట్ల గురించే ఇప్పటివరకు మనకు తెలుసు.. కానీ కొన్ని మొక్కలు మనుషుల ప్రాణాలను తీయగలవని మీకు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కలు ఈ భూమ్మీద కొన్ని ఉన్నాయి. మొక్కే కదా కని పొరపాటున వాటిని ముట్టుకున్నా ప్రాణాలను తీసేస్తుంది. స్వయంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇంత భయంకరమైన మొక్కలు ఎక్కడ ఉంటాయి? వాటి కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కలుగా గింపీ-గింపీ (Gympie-Gympie)ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉర్టికేసి రేగుట జాతికి చెందిన ఈ మొక్కలు ఎక్కువగా ఆస్త్రేలియా, ఇండోనేషియా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. పొరపాటున వీటి ఆకులను తాకినా భయంకరమైన నొప్పి కలుగుతుందట. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునేలా ఇవి మనల్ని ప్రేరేపిస్తాయట. అందుకే ఈ మొక్కలను ‘సూసైడ్ ప్లాంట్ ’(Suicide Plant)అంటారు.

వీటి వల్ల మనుషులకే కాదు, జంతువుకలకు కూడా హానీ కలుగుతుందట. 1886లో ఓ గుర్రం ఈ మొక్కను తాకిన కాసేపటికే మతిస్థిమితం కోల్పోయి 2గంటల్లోనే మరణించినట్లు పరిశోధకులు తెలిపారు. గింపీ-గింపీ ఆకులపై సన్నని సూదుల్లాంటి ఉంటాయట. వీటిని ముట్టుకుంటే ఆ నొప్పి భరించలేక చనిపోవడమే బెటర్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుందట.

ఈ ఆకులను ముట్టుకున్న 30 నిమిషాల్లోనే దద్దుర్లు, వాపులు వచ్చి నొప్పి తీవ్రంగా మారుతుందట. దీంతో నిద్రపోవడం కూడా కష్టమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.పొరపాటున ఆ మొక్కలను ముట్టుకొని తక్షణం చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదట. చాలా సంవత్సరాల పాటు ఆ నొప్పి శరీరంలో అలాగే ఉంటుందట. కాబట్టి గింపీ జోలికి వెళ్లకపోవడమే బెటర్‌. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)