Breaking News

Weight Loss వెయిట్‌ లాస్‌కి దివ్య ఔషధంలా.. ఆరోగ్యంగా!

Published on Mon, 05/26/2025 - 17:09

సత్తు పిండి గురించి ఎపుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.బరువు తగ్గడంలో ఎంతో సాయపడుతుంది. గుండె, షుగర్‌వ్యాధి  గ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?

సత్తు పిండిని శనగపప్పు (చనా) లేదా ఇతర పప్పులను పొడిగా వేయించి, మెత్తని పిండిగా తయారు చేస్తారు.  ఈ సత్తుపిండి, బెల్లం కలిపి లడ్డూలు చేసుకొని,  ఇంకా వివిధ రూపాల్లో  రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా,  బరువు తగ్గవచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్ , ఇనుము, కాల్షియం ,మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  ఆకలిని తగ్గించి, అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడంలో సహాయపడుతుంది.

సత్తు పిండి  బరువు తగ్గడంలో  ఎలా సాయపడుతుంది?
ప్రోటీన్ అధికంగా ఉండటం వలన మీరు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్‌ ఉంది.
ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది కనుక  కండరాలను బలిష్టం చేస్తుంది.  ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉండి, చిరుతిళ్లు తినకుండా నిరోధించవచ్చు. తద్వారా మనం  తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది.

ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం , ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ పోషకాలను సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. అనవసరమైన బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

జీవక్రియను పెంచుతుంది సత్తులో ఇనుము, మెగ్నీషియం , కాల్షియం జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి. అధిక జీవక్రియ కేలరీల బర్న్ చేయడానికి గంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇందులోని తక్కువ గ్లైసెమిక్రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బ్లడ్‌లోకి  చక్కెరనునెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో  షుగర్‌ స్థాయిలు సడన్‌గా పడిపోవడం, పెరిగిపోవడం లాంటివి ముప్పు తప్పుతుంది. రక్తంలో చక్కెర స్థాయి కారణంగా వచ్చే ఆకలి బాధలను నియంత్రింస్తుంది.

సత్తు సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తుంది, శరీరం నుండి విషాన్ని (టాక్సిన్స్‌) బయటకు పంపడంలో సహాయ పడుతుంది.  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అదనపు కేలరీలు లేకుండా శక్తిని అందిస్తుంది. అధిక కేలరీల ప్రాసెస్ చేసిన ఆహారాల మాదిరిగా కాకుండా, సత్తు అనేది సహజమైన శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.  అనవసరమైన కొవ్వులు లేదా చక్కెరలు లేకుండా  మంచి  శక్తిని అందిస్తుంది.

సత్తుతో రెసిపీలు

సత్తు పానీయం
2 టేబుల్ స్పూన్ల సత్తును ఒక గ్లాసు నీరు, చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో కలపుకొని తాగవచ్చు. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్‌లో  కేలరీలు తక్కువ. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ క్రమబద్ధీకరించడంతోపాటు, రోజంతా కడుపు నిండుగా ఉన్న అనుభూతి నిస్తుంది.

సత్తు మజ్జిగ: జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, మజ్జిగతో ఈ పిండిని కలిపి  తాగవచ్చు. మజ్జిగ జీర్ణక్రియ,  పేగు ఆరోగ్యానికి సహాయపడితే, సత్తు ప్రోటీన్ , ఫైబర్‌ను  అందిస్తుంది. సో ఇది బరువు తగ్గడానికి అనువైన పానీయంగా మారుతుంది.

సత్తు రోటీ లేదా పరాఠ : సత్తును గోధుమ పిండితో కలిపి పోషకమైన రోటీ లేదా పరాఠా తయారు చేసుకోవచ్చు.

సత్తులడ్డు: సత్తును బెల్లం, కొద్దిగా నెయ్యితో కలిపి లడ్డూలు సిద్ధం చేసుకొని తినవచ్చు. ఇది శక్తినివ్వడంతోపాటు,   చక్కెర స్నాక్స్‌కు  మంచి  ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

నోట్‌ :  ఇది సాధారణ అవగాహన కోసం అందించిన  సమాచారం మాత్రమే.  ఈ ఆహారాన్ని తీసుకునే ముందు  మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించగలరు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)