Breaking News

సౌందర్య సంరక్షణకు 'డీఎన్‌ఏ డీకోడ్‌'..!

Published on Thu, 10/02/2025 - 13:07

అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్‌ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ టి.ఎన్‌.రేఖా సింగ్‌. మీ డీఎన్‌ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో  సవివరంగా తెలుసుకుందాం.

అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్‌ఏని డీ కోడ్‌ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్‌ఏని డీకోడ్‌ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. 

మన శరీర డీఎన్‌ఏలో ముఖంపై పిగ్మెంటేషన్‌తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్‌-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్‌లో  కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్‌ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు.  అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్‌కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. 

ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్‌ పిగ్మెంటేషన్‌ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్‌ రేఖా సింగ్‌ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. 

దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్‌ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

డీఎన్‌ఏ డీకోడ్‌ అంటే..
జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్‌ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.

ఈ డీఓన్‌ఏ డీకోడ్‌తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్‌ఏ డీకోడ్‌ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. 

(చదవండి: తాగునీరు అంత విలువైనదా..?)

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)