Breaking News

Diwali 2024 మోతీ చూర్‌ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!

Published on Wed, 10/30/2024 - 16:10

ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా  ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్‌ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి  ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!

మోతీ చూర్‌ లడ్డూ పేరు వెనుక రహస్యం
హిందీ లో, 'మోతీ' అంటే ముత్యం  అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని.  అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా  వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.

సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో  తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం  మంచిది.  రంగుకోసం కుంకుమపువ్వును,  వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.

మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:
రెండు కప్పుల సెనగపిండి 
రెండు కప్పుల పంచదార
యాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్‌మిస్‌ 
బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,
కర్పూరం పొడి

తయారీ: 

ఒక గిన్నెలో  రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి.  బాగా జల్లించుకుని ఉండలు లేకుండా  పిండిని బాగా జారుగా కలుపుకోవాలి.   పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి.  మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ  పువ్వును నానబెట్టి   కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.

పంచదార పాకం
ఇపుడు  మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి.  చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.

బూందీ తయారీ
స్టవ్ మీద  మూకుడు పెట్టి  ఆయిల్‌ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ,  అబకతో గానీ బూందీలా నూనెలో  వేసి డీప్​ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్‌ నాప్‌కిన్‌పై ఉంచాలి.

తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం,  జీడిపప్పు, కిస్‌మిస్‌ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని  మనకు కావాల్సిన  పైజులో లడ్డూల మాదిరిగా  చుట్టుకోవాలి.  అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ 

నోట్‌ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్‌లో చాలా నూనె  పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్‌ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)