Breaking News

Diwali 2024 పలు కారణాల పండగ

Published on Thu, 10/31/2024 - 15:01

ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.

దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్‌ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.

జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్‌–తేరస్‌). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్‌–తేరస్‌’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.

అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్‌’.

దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు!                          
– ఎం. మారుతి శాస్త్రి 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)