Breaking News

వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి

Published on Sun, 06/29/2025 - 05:10

విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని,  ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని,  ఆయుష్షునూ తగ్గిస్తాయని  నివేదికలు తెలుపుతున్నాయి.  తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్‌ అట్లాంటిక్‌లోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్‌ నోలన్‌ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్‌ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్‌. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.

జీవనశైలిలో తీవ్ర మార్పులు
చిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని  పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. 

ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్‌ ట్యాక్స్‌ రికార్డులు, సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.

వ్యాధుల పాలయ్యే ప్రమాదం
కొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్‌ ప్రోటీన్‌ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్‌ వల్ల కరోనరీ హార్ట్‌ డిసీజ్, టైప్‌– 2 డయాబెటిస్‌ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్‌ ఎక్కువ ఉందని గుర్తించారు.

మానసిక అనారోగ్యం
పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది.  

విపరీతమైన భావోద్వేగాలు
తిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.  ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్‌ఫార్మెన్స్‌ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.

సమాజంలో ప్రవర్తన
కొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి.  

ఇద్దరిదీ సమాన బాధ్యత
ఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా  ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. 
– డా. సునీత, సైకాలజిస్ట్‌

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)