Breaking News

నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?

Published on Sat, 06/08/2024 - 09:56

ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్‌ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని,  కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.

కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..
సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.

జీర్ణ సమస్యలు..
కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్‌ రిఫ్లక్స్‌ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.

కిడ్నీవ్యాధులు..
మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి.  మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.

బీపీ, షుగర్‌..
మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.

కాలేయ సంబంధ వ్యాధులు..
లివర్‌ సిర్రోసిస్‌ లేదా ఫ్యాటీ లివర్‌ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.

అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్‌వాష్‌లను, ఇతర విధాలైన మౌత్‌ ఫ్రెష్‌నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.

ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)