Breaking News

ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది?

Published on Mon, 10/21/2024 - 11:55

గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.

అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు.  ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్‌... కర్మ  చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.

ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు..  మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’
 

‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా  చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.

-చాగంటి కోటేశ్వరరావు

 

 


 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)