Breaking News

సమస్యలే సాఫల్యానికి సోపానాలు

Published on Thu, 04/03/2025 - 15:10

ఒక ఊరిలో జలాలుద్దీన్‌ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి కుటుంబం పెద్దది కావడంతో ఇల్లు ఏమాత్రం సరిపోయేది కాదు. చివరికి ఒకరోజు మసీదులో ఉన్న ధార్మిక గురువు దగ్గరికెళ్ళి ఉపాయం చెప్పమని  ప్రాధేయపడ్డాడు. సావధానంగా విన్న గురువు.. ‘నువ్వొక కోడిని తీసుకువెళ్ళి మీతోపాటే ఇంట్లో ఉంచుకో. నీ సమస్య తీరిపోతుంది.’ అన్నాడు.

ఆ వ్యక్తి కోడిని కొనుక్కొని వెళ్ళాడు. తమతోపాటే దాన్ని ఇంట్లో ఉంచాడు. అలా వారం గడిచింది. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆ వ్యక్తి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ‘‘అయ్యా.. మరికాస్త ఇబ్బంది ఎక్కువైంది’’ అని మొర పెట్టుకున్నాడు. ‘‘ఈసారి ఒక మేకను తీసుకువెళ్ళు. దాన్నీ మీతోపాటే ఇంట్లో ఉంచు. మళ్ళీ వారం తరువాత వచ్చి కలువు’ అన్నాడు గురువు.

ఆ వ్యక్తి మేకను కొనుక్కొని తీసుకువెళ్ళాడు. ఈసారి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. గురువు దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నాడు. అతను చెప్పినదంతా విని.. ‘ఇప్పుడు నువ్వు ఒక గాడిదను తీసుకు వెళ్ళు.. దాన్నీ మీతోనే ఇంట్లోనే ఉంచు. నీకు శుభం కలుగుతుంది’ అన్నాడు. గురువు మాటమీద గాడిదను తెచ్చిన తరువాత ఇల్లు నరకం అయిపోయింది. ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వీధి వీధంతా అల్లకల్లోలం మొదలైంది. ఏడవరోజు గాడిదతో పడిన నరక బాధను చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు.  అప్పుడు గురువు ‘సరే.. నువ్వు ఇంటికెళ్ళి కోడిని కోసి వండుకొని తిను. వారం తరువాత వచ్చి కలువు.’ అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆరోజు కోడి కూర వండాడు. వారం తరువాత వెళ్ళి గురువుని కలిశాడు. 

‘అయ్యా.. సమస్య అయితే తీరలేదు కాని, కాస్తంత పరవాలేదు.’ అన్నాడు. ‘ఈసారి మేకను కోసి విందు చేసుకోండి. మీ వీధి వారిని కూడా విందుకు పిలవండి.’ అని పురమాయించాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి గురువు చెప్పినట్టే చేసి వారం తర్వాత సంతోషంగా.. ‘‘ఇప్పుడు పరిస్థితి మెరుగు పడింది.’ అని  చెప్పాడు. అప్పుడు గురువు, ‘‘నువ్వు గాడిదను సంతలో అమ్మెయ్‌ ..’ అని సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి గాడిదను సంతలో అమ్మేసి ఇంటికి వెళ్ళాడు. వారం ప్రశాంతంగా గడిచింది. గురువు చేసిన ఉపదేశాల్లోని మర్మం అర్థమైంది. ‘అంతా అల్లాహ్‌ అనుగ్రహం గురువు గారూ..ఇప్పుడు పరమ సంతోషంగా ఉంది. ఇల్లు విశాలమై పోయింది.’ చెప్పాడు పరమానందంగా..!
– ముహమ్మద్‌  ఉస్మాన్‌ ఖాన్‌ 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)