Breaking News

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

Published on Mon, 08/18/2025 - 10:03

భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది.  ఈ భారతేతిహాసం వల్ల మోహం అంటే మానవ సహజమైన భ్రాంతి మటుమాయమవుతుంది. భారతం ఒక మహావృక్షం. సంగ్రహ అధ్యాయం దానికి బీజం. పౌలోమ – ఆస్తీక కథలు మూలం. కురు పాండవ జనన కథ స్కంధం. సభారణ్య పర్వాలు కొమ్మలు, అరణ్య పర్వం రూపం. విరాట – ఉద్యోగ పర్వాలు సారం. భీష్మ పర్వం ప్రధాన శాఖ. ద్రోణ పర్వం ఆకులు. కర్ణపర్వం ఆ చెట్టు పూచిన తెల్లని పువ్వులు. శల్య పర్వం ఆ పువ్వుల పరిమళం. స్త్రీ పర్వం నార. శాంతి పర్వం మహాఫలం. అశ్వమేధ పర్వం ఆ ఫల సంబంధమైన అమృతరసం. ఆశ్రమవాస పర్వం ఆ చెట్టునీడ. మౌసలం శ్రుతి సంగ్రహం. అలాంటి భారత మహావృక్షం కవుల కావ్యకృతికి పోషకం అవుతుంది. 

భారత కథ వినడానికి జనమేజయుడు తగిన సమయం నిర్ణయించుకున్నాడు. ఆస్థాన పండితులను సమా వేశపరిచాడు. వైశంపాయనుడిని సముచితంగా పూజించాడు. వైశంపాయనుడు ముందుగా హృదయంలో గురు బ్రహ్మకు మొక్కి, ప్రత్యక్షంగా ఉన్న గురుమూర్తికి పాదాభివందనం చేసి, సభ్యులకు చెప్పి, వారి అనుమతితో భారత కథ చెప్పడం మొదలుపెట్టాడు. భారతం శ్రద్ధాభక్తులతో వినే వారికి ఇష్టార్థ సిద్ధినీ, శుభ సంపద్వృద్ధినీ కలిగిస్తుంది. రాజులకు రాజ్యాభివృద్ధినీ, అభ్యుదయాన్నీ సమకూరుస్తుంది. సత్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో నీతికథలను చెప్పిన మహా ప్రబంధం. అన్ని లోకాలకూ పూజ్యమైనది. ఇతిహాసాలలో అగ్రగణ్య. లౌకిక న్యాయశాస్త్రానికి గురువు. వేద వేదాంత విషయాలను బోధించేది భారతమని వైశంపాయనుడు చెప్పాడు. అంత గొప్పది కాబట్టే ‘వింటే భారతం వినాలి’ అంటారు.   

 – యామిజాల జగదీశ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)