Breaking News

శ్రావణ మాసంలో మహిళలు ఆకుపచ్చని గాజులే ఎందుకు ధరిస్తారంటే..?

Published on Wed, 07/30/2025 - 08:52

శ్రావణ మాసం అంటేనే పండుగలు, కళ్యాణ వైభోగాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉండే మన ఆచార వ్యవహారాలు సైన్సుకే అందని విషయాలను వివరిస్తాయి. ప్రతిదాంట్లో సంప్రదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంల వరాలిచ్చే వరలక్ష్మీ దేవిని కొలిచే మహిళల కట్టు, బొట్టు, తినే ఆహారం ఇలా ప్రతిదాంట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలా ఎందుకో సవివరంగా తెలుసుకుందామా.!.

శ్రావణ మాసంలో భారతీయ వివాహితలు ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. ఇది వారి సంతోషకరమైన, సుసంపన్నమైన వైవాహిక స్థితిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభప్రదమని, సంతానోత్పత్తికి సంబంధించినదని వారి నమ్మకం. అంతేకాదు, తమ శ్రేయస్సుకు, అదృష్టానికి, ప్రకృతి పునరుద్ధరణకు ప్రతీకగా ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. 

వర్షాకాలంలో వాతావరణం ప్రశాంత శక్తితో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగ సమతౌల్యతను కలిగిస్తుంది. అన్యోన్యతకు సూచికగా, సంప్రదాయం, ఆరోగ్యం, భక్తిని ఒకే వరసక్రమంలో పరిచయం చేసే శక్తి ఆకుపచ్చ రంగుకు ఉంటుంది. గాజుల శబ్దం ప్రతికూలతను దూరం చేస్తుందని నమ్మకం. శివ–శక్తి దైవిక ఐక్యతను ప్రతిబింబించే సామరస్యాన్ని కూడా సూచిస్తుందనే  భావన దీనిలో ఇమిడి ఉంది.

ఫలవంతమైన ఎంపిక
శ్రావణ మాసం వర్షాకాలం కనుక అలెర్జీలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సి–విటమిన్‌ సమృద్ధిగా లభించే పండ్లు తీసుకోవాలి. అలాగే, జీర్ణక్రియకు మేలు చేసేవీ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. నారింజలో అధికంగా ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

అయితే, రసాయనాల గాఢత లేని వాటిని ఎంచుకోవడం మేలు. అరటిపండు శక్తినిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయపడుతుంది. ఈ మాసంలో అరటిపండు వాడకం విరివిగా కనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి మలబద్ధక నివారిణిగా కూడా పనిచేస్తుంది.  

(చదవండి: బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)