Breaking News

మోసం చేస్తే మోసమే!

Published on Thu, 07/03/2025 - 10:37

పూర్వం బాగ్దాద్‌ నగరంలో బహెలూల్‌ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్‌ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్‌ , ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు.

‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత  ప్రాధేయపడినా కనికరించకుండా, ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు.’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్‌ అతణ్ణి ఊరడిస్తూ.., ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను.’ అన్నారు ప్రశాంతంగా..

‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..?’ అంటూ ఆశగా చూశాడా వ్యక్తి..  ‘‘కాని ఎలా సాధ్యం? ఆవ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు నిరాశతో.. ‘‘అలా అనకు.. నిరాశ తిరస్కారం 

( కుఫ్ర్‌ )తో సమానం.. దైవచిత్తమైతే నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్‌. ’నిజమే.. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడం లేదు.’

’నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్‌ . నీ పైకం ఇప్పించే పూచీనాది.’ అన్నారు బహెలూల్‌ ధీమాగా..

’సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ’రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు.’ అన్నారు బహెలూల్‌ . సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్‌ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

తెల్లవారి ఉదయం బహెలూల్‌ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, కాస్త ఈ సంచి మీదగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఇందులో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉందని చెప్పారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోస΄ోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతనితో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్‌ కూడా తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తనదారిన తను వెళ్ళిపోయారు. 

కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్‌ దాచిన నాణాల సంచి విప్పి చూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమెన జీవనం  ప్రారంభించాడు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌∙

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)