Breaking News

ఈ సరస్సులో దయ్యం ఉందట!

Published on Sun, 09/22/2024 - 08:08

ఈ సరస్సు చూడచక్కగా ఉంటుంది. ఇందులోని నీళ్లు స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటాయి. అయినా, జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు. గుండెధైర్యం ఉన్న కొద్దిమంది ఇక్కడకు పిక్నిక్‌లకు వస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సరస్సులో దయ్యం ఉందన్న ప్రచారమే జనాల భయానికి కారణం. అమెరికాలోని లాంగ్‌ ఐలండ్‌లో ఉన్న ఈ సరస్సు పేరు ‘రోంకోంకోమా లేక్‌’. ఇక్కడి స్థానికులు ఈ సరస్సు నీళ్లల్లో అరికాళ్ల మునివేళ్లను ముంచడానికి కూడా భయపడతారు. 

రోంకోంకోమా సరస్సులో దయ్యం ఉందనే గాథకు మూలాలు పదిహేడో శతాబ్ది చివరికాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి స్థానిక మూలవాసులైన ‘సెటాకెట్‌’ తెగకు చెందిన యువరాణి టుస్కావాంటా ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు వచ్చే తెల్లజాతి యువకుడితో ప్రేమలో పడింది. టుస్కావాంటా తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులోనే ఉందని, సరస్సులోకి వచ్చే పురుషులను బలిగొంటూ ఉందని లాంగ్‌ ఐలండ్‌ జనాలు చెప్పుకుంటుంటారు. 

గడచిన శతాబ్దకాలంలో ఈ సరస్సులో పడి 160 మందికి పైగా యువకులు అంతుచిక్కని పరిస్థితుల్లో మరణించారు. ఈ సరస్సులోని దయ్యం ఏడాదికి కనీసం ఒక యువకుడినైనా బలిగొంటుందని ఇక్కడి జనాల నమ్మకం. ఈ సరస్సు తీరంలో డేవిడ్‌ ఇగ్నేరీ (74) దాదాపు ముప్పయి ఏళ్ల పాటు లైఫ్‌గార్డ్‌గా పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోనే ఈ సరస్సులో పడి ముప్పయి మంది మరణించారని, వారందరూ యువకులేనని అతడు చెబుతున్నాడు. 

స్థానికుల నమ్మకాలు, భయాలకు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడి జనాలు సరస్సులో పడి ఆత్మాహుతి చేసుకున్న యువరాణి కట్టెబొమ్మను భారీసైజులో ఇక్కడ నెలకొల్పారు. అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ గాథను వివరిస్తూ, పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం. 

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు