Breaking News

గ్రీన్‌ చాయిసెస్‌..! ఎంపవర్‌ వాయిసెస్‌..!!

Published on Fri, 08/02/2024 - 10:06

విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్‌ ఘాట్స్‌ బయోడైవర్సిటీ సెంటర్‌లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్‌లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్‌ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్‌ఓ అనంత్‌ శంకర్‌ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.

మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్‌ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ఎంఐటి బూట్‌ క్యాంప్‌ ్రపోగ్రామ్‌ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.

ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్‌ పేపర్‌తో నోట్‌ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.

రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్‌ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్‌ స్టాండ్, అందమైన రంగులతో కాటన్‌ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్‌ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్‌ చాయిసెస్‌.. ఎంపవర్‌ వాయిసెస్‌. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)