Breaking News

ముహూర్తానికి డెలివరీ లేట్‌ చేశారు, పాపకిక కష్టాలేనా? కేసు వేస్తా..!

Published on Wed, 06/11/2025 - 10:26

ఇటీవలే ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మాకు పాప పుట్టింది. మా ఆవిడ గర్భవతి అయినప్పటినుంచి ఒకే డాక్టరు వద్ద చూపిస్తున్నాము. మా పంతులుగారిని అడిగి కాన్పుకు ముహూర్తం పెట్టుకున్నాము. హాస్పిటల్‌ వారికి చెప్పగా అలా చేయాలి అంటే ‘ముహూర్తం చార్జెస్‌’గా 10 వేల రూపాయలు ఎక్కువ కట్టాలి అని చెప్పారు. సరేలే అని అది కూడా కట్టాను. కానీ, డాక్టరు మరొక ఎమర్జన్సీ సర్జరీ ఆలస్యం అవటం వలన మా డెలివరీ ఆలస్యం చేశారు. మరొక ముహూర్తం కోసం ఆ రోజు సర్జరీ కూడా ఆపటం కుదరదు అని చెప్పారు. అందువల్ల మాపాప దుర్ముహూర్తాన పుట్టింది. దుర్ముహూర్తంలో పుట్టటం వలన పాపకి జీవితాంతం కష్టాలే ఉండ వచ్చు. అయితే పరిహారాలు చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది అని అంటున్నారు. వీటంతటికీ కారణం అయిన హాస్పిటల్‌ మీద, డాక్టరు మీద చర్యలు ఎలా తీసుకోవాలో సలహా ఇవ్వగలరు.- విక్కాంత్, సికింద్రాబాదు


బాగుందండి. చాలా బాగుంది. కేసు వేయటానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారా? జడ్జిగారిని కూడా మీరు పెట్టుకున్న ముహూర్తానికే జడ్జిమెంట్‌ ఇమ్మని కూడా చెబుదామా? ఒకవేళ కేసు ఓడిపోతే ముహూర్త వైఫల్యం అంటారా లేక నా సలహా వైఫల్యం అంటారా? లేక ఏకంగా జడ్జీ గారికి గ్రహణం పట్టింది అంటారా? 

సెంటిమెంట్లు మీ వ్యక్తిగతం. మీ నమ్మకాన్ని మీరు పాటించవచ్చు, కాపాడుకోవచ్చు. అయితే అది చట్టానికి, న్యాయానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఉండకూడదు! అదేవిధంగా ప్రకృతి విరుద్ధంగా కూడా ఉండకూడదు. ఎవరు ఎప్పుడు జన్మించాలి అనేది దేవునిపై నమ్మకం ఉన్నవారు దైవనిర్ణయంగా భావిస్తే మంచిది. ఆధునిక వైద్యవిధానం - సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మీ నమ్మకాన్ని జోడించి కాన్పు సమయాన్ని నిర్ణయించుకున్నారు. కానీ అదే సమయంలో ఇంకొక మనిషికి సహాయపడుతున్న డాక్టర్‌ గారిని శిక్షించాలి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 

ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌

మీకు ఇచ్చే జవాబు ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రి వారికి అలాగే ప్రభుత్వాలకి కూడా ఒక సూచన చేయాలి అనుకుంటున్నాను. రాజ్యాంగంలోని 51ఎ(జి) ఒకసారి చదవండి. ప్రభుత్వాలు శాస్త్రీయతను, మానవ విలువలను, తర్కాన్ని పెంపొందించాలి తప్ప మూఢనమ్మకాలను కాదు. వ్యక్తిగత నమ్మకాల కోసం మరొకరి జీవితాలను, హక్కులను కూడా లెక్కచేయను అనే ధోరణిని అరికట్టవలసిన అవసరం ఉంది. అధిక డబ్బు వసూలు చేసి మరీ ఇలాంటి ముహూర్తాలు పెట్టి కాన్పులు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోరణిని నియంత్రించాలి. 

చదవండి: పిల్లలకు సోషల్‌ మీడియా పరిమితులు : ఫోన్‌పై స్మార్ట్‌చెక్‌

ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... మీ కేసులో ముహూర్తానికి 10,000 వసూలు చేసిన ఆసుపత్రి పై దావా వేసినా, కన్జ్యూమర్‌ కోర్టును ఆశ్రయించినా మీరు కట్టిన డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. మీరు కేసు వేసి హాస్పిటల్‌ వారిపై ఫైన్‌ కూడా విధించాలి అని కోరండి. మీ కేసులో డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ, మరొకసారి ఇలాంటి మతిలేని పనులు చేయడం మానేస్తారు హాస్పిటల్‌ వారు! మ్యాజిక్‌ రెమిడీస్‌ యాక్ట్, 1954, పరిధిలోకి ఇలాంటి హాస్పిటళ్లను తీసుకురావాలి.

– శ్రీకాంత్‌ చింతల,
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు,  సందేహాలకోసం 
sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)