Breaking News

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!

Published on Fri, 09/20/2024 - 16:44

మన దేశ రాజధానిని చారిత్రాత్మక ప్రాధాన్యత తోపాటు విభిన్న సంస్కృతుల కలబోతగా పేర్కొనవచ్చు. ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా అనంతరం కొత్త సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కాగా మూడో మహిళ సీఎంగా నిలవడం విశేషం. పంజాబీ కుటుంబానికి చెందిన మన కొత్త సీఎం ఇష్టంగానే తినే వంటకం గురించి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

మన దేశ రాజధాని ఆహ్లాదపరిచే వివిధ వంటకాల సమ్మేళనాలకు ప్రతీకగా ఉంటుంది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు విభిన్న సంస్కృతుల రుచులు ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి ఢిల్లీకి సీఎం కానున్న అతిషి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తాం అనే వాగ్దానంతో ప్రజల్లోకి బలంగా వచ్చిన నాయకురాలు. అయితే ఆమె ఒక ఇన్‌స్టాగ్రాం వీడియోలో తనకు ఇష్టమనే రెసీపీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తనకు 'రాజ్మా చావలె' అంటే మహాఇష్టమని చెప్పారు. 

పంజాబీ వంటకమైన ఈ మసాల రెసిపీ సంపూర్ణంగా తిన్న ఫీల్‌ని అందిస్తుంది. దీన్ని వండటం చాల సులభం. అప్పటికప్పుడూ ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉత్తర భారత వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. మరింత రుచికరంగా ఉండాలంటే.. ఈ రాజ్మా కర్రీలో చివరగా కాస్త క్రీమ్‌ లేదా వెన్నని జోడిస్తే ఆ రుచే వేరేలెవెల్‌ అని అన్నారు. అయితే ఆమె తాను స్వయంగా వండటంలో ఇబ్బంది లేదు గానీ తానే ఆ కూర తినాలంటే మాత్రం కష్టమే అంటూ చమత్కరించారు.

(చదవండి: కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!)


 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)