Breaking News

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Published on Thu, 02/20/2025 - 13:17

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ  సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది.  ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట  చాలా ఆసక్తి నెలకొంది.

ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా  ఉందని  అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రేఖ గుప్తా నికర ఆస్తుల విలువ
రేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.

రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? 
హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన  రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.

విద్యార్థి దశలోనే  ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్‌లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.  ఆ తరువాత  2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో  ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు  2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)