Breaking News

వీణల విందుగా...

Published on Sun, 02/16/2025 - 04:49

వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...

తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!
అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్‌ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది.  దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతోంది.

‘ఇంజినీరింగ్‌ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి  మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్‌ క్లాస్‌లో సర్టిఫికెట్‌ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.

నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్‌భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్‌ జిష్ణు దేవ్‌వర్మ ప్రశంసలు అందుకుంది. 

వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం.
 

ధ్యానం లాంటి వీణ
వీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. 
– అప్పికట్ల దీప్తి
 
– అంబటి శేషుబాబు 
సాక్షి, మచిలీపట్నం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)