Breaking News

గ్రాండ్‌ ఈవెంట్‌ దీప్‌మేల 2023 వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడంటే

Published on Wed, 08/09/2023 - 13:08

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్‌మేల ఈవెంట్‌ వచ్చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్‌ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావ​చ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్‌ వేర్‌, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్‌లో  ప్రదర్శించనున్నారు.

దీప్ మేల వెనక దీప్ శిఖా 

దీప్‌మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు, మధు జైన్ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్‌శిఖ వొకేషనల్ జూనియర్‌ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.

దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు 

ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్‌మేళాను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్‌ ఇందులో భాగం కానున్నాయి. దీప్‌మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్‌టెయిల్‌లు అందించే ఫుడ్‌ కోర్ట్‌ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ  ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు  రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు. 

దీప్ శిఖా కార్యవర్గం వీరే

ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని,   వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)