Breaking News

‘షో కిటికీల’తో ఇంటి అలంకరణ అదుర్స్‌..!

Published on Sun, 08/31/2025 - 13:03

వివిధ రకాల మోడళ్లలో ఉండే కిటికీలను, వాటి తెరలను చూస్తుంటాం. వాటి డిజైన్‌కి, అలంకరణకు, కర్టెన్ల ప్రింట్లకు ముచ్చట పడిపోతుంటాం. కిటికీలు ఇంటి లోపలికి గాలి వెలుతురు వచ్చేందుకు ఏర్పాటు చేస్తుంటారు. వాటికి అలంకరించే తెరలు దుమ్ము, గాలుల నుంచి రక్షణగా కూడా వాడుతుంటారు. కాని, ఇంటి అలంకరణ కోసం ‘షో కిటికీల’ను వాడితే.. ఎలా ఉంటుందో చూడాలంటే... కర్టెన్లు ఉన్న ఈ విండో వాల్‌ ఫ్రేమ్స్‌ను చూడాల్సిందే!

అపార్ట్‌మెంట్ల కల్చర్‌ పెరిగిపోయాక పెద్ద పెద్ద లోగిళ్లు ఉన్న ఇళ్లు తగ్గిపోతున్నాయి. కిటికీలు పెట్టాలంటే అన్ని చోటలా కుదరకపోవచ్చు. లేదంటే వాల్‌ హ్యాంగర్స్‌గా ఏదైనా బాగుంటుంది అనే ఆలోచనా కావచ్చు. వీటన్నింటికీ ఒకే సమాధానంగా ‘షో విండోస్‌’ సరైన ఎంపిక అవుతున్నాయి. 

ఫ్లవర్‌ బాస్కెట్‌గా! 
వుడెన్‌ లేదా పీవీసీ మెటీరియల్‌తో చేసిన క్రియేటివ్‌ విండో షెల్ఫ్‌ డెకరేషన్‌ ఫ్లవర్‌ బాస్కెట్‌గా డిజైన్స్‌ బట్టి వెయ్యి రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. దీనిలోనే వింటేజ్‌ విండోస్‌ ఫ్రేమ్‌ వాల్‌ డెకర్‌ ప్లాంట్‌ లేదా హ్యాంగింగ్‌ ప్లాంట్‌ పాట్స్‌ హోల్డర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవి ఇంటి లోపలి గదుల్లో గోడలకు అలంకరించవచ్చు. బుక్‌ షెల్ఫ్‌ లేదా పెన్నులు, పెన్సిల్స్‌ వేసుకునేలా కూడా ఉపయోగించవచ్చు. 

కార్వింగ్‌.. తెరలు
చుట్టూ అందమైన వుడెన్‌ కార్వింగ్, మధ్యలో మిర్రర్‌ వచ్చేలా కూడా ఈ షోకేస్‌ విండోస్‌ హ్యాంగర్స్‌ లభిస్తున్నాయి. రకరకాల డిజైన్లలో ఉండే చిన్న చిన్న తెరలు ఉండే ఈ డిజైన్‌ హోల్డర్స్‌ బెడ్‌రూమ్, డ్రాయింగ్‌ రూమ్, లివింగ్‌ రూమ్‌లకు అందాన్ని తీసుకువస్తాయి. 

ఆరుబయటఇండోర్‌ విండో షెల్ఫ్‌ హోల్డర్స్‌ ఒకలాంటి అందాన్ని తీసుకువస్తే, ఔట్‌డోర్‌కి మరొక అలంకరణగా మారిపోతాయి. ఔట్‌డోర్‌ గోడకు విండో షెల్ఫ్‌ హోల్డర్‌ని తగిలించి, దాని ముందు టేబుల్, ఇరువైపులా రెండు చెయిర్లు వేస్తే గార్డెన్‌ లేదా కేఫ్‌లుక్‌ వచ్చేస్తుంది. 
ఎన్నార్‌ 

(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)