Breaking News

ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..

Published on Sun, 03/15/2026 - 10:46

పేరెంట్స్‌ పిల్లలకు గిఫ్ట్‌ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్‌ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్‌ అమ్మో ఇద్దరూ కూతుళ్ల అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. 

ఇద్దరు టీనేజ్‌ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఏంటా సర్‌ప్రైజ్‌ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. 

అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్‌ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్‌ సర్‌ప్రైజ్‌కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. 

అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. 

ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్‌ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్‌..!)
 

#

Tags : 1

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)