Breaking News

Badi Ganta స్కూల్‌ బ్యాగ్‌ బరువు ఎంత ఉండాలి?

Published on Tue, 06/24/2025 - 05:50

స్కూల్‌ బ్యాగ్‌ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్‌లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నట్టు అనుకోకూడదు. స్కూల్‌ బ్యాగ్‌ విద్యార్థికి నెత్తిన మోసే మూట కాకూడదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్‌ బ్యాగ్‌ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని  ఆ భారాన్ని మోస్తూ ఆనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్‌కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపడం. హమాలీలుగా పంపడం కాదు. మోసి చూశారా  మీ పిల్లల స్కూల్‌ బ్యాగ్‌ బరువెంతో?

స్కూల్‌ బ్యాగ్‌ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్‌లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నారని సంబరపడి పోతుంటారు కొందరు తల్లిదండ్రులు.  విద్యార్థి మోసే బ్యాగ్‌ బరువును బట్టి అతని చదువును అంచనా వేస్తారు మరికొందరు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. పిల్లల వీపున బండ మోయించినట్లు వారి చేత స్కూల్‌ బ్యాగ్‌ మోయించడం సబబు కాదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్‌ బ్యాగ్‌ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. 

పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్‌కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపాలి. మీరెప్పుడైనా చూశారా మీ పిల్లల స్కూల్‌ బ్యాగ్‌ బరువెంతో? ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలకు చదువు పేరుతో చాలా పని పెడుతుంటారు. కొందరు ఇది పిల్లలకు అవసరం అనుకుంటే మరికొందరు ఈ మాత్రం హడావిడి స్కూల్‌కు అవసరం అనుకుంటారు. 

అందుకే చాలా స్కూళ్ల లో రెగ్యులర్‌ సిలబస్‌తోపాటు అసైన్ మెంట్, ప్రాజెక్టులు, స్లిప్‌ టెస్టులు, క్లాస్‌ వర్క్, హోం వర్కు, రఫ్‌ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్‌ నాలెడ్జ్, కంప్యూటర్‌ బుక్‌.. ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్‌కు 6 నుంచి 7 నోటు బుక్స్‌లను కేటాయిస్తూ విద్యార్థుల వెన్ను వంచుతున్నారు. స్కూల్‌ బ్యాగ్‌ బరువు విద్యార్థి వయస్సు, ఎత్తుకు తగ్గట్టు ఉండాలని, విద్యార్థి బరువులో 10 శాతం మించకుండా ఉండాలని నిపుణులు చెప్పే మాటలు మాటలుగా ఉండిపోతున్నాయి. అధిక బరువున్న స్కూల్‌ బ్యాగులు పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పికి దారితీస్తోంది. (పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?)

పిల్లల బ్యాగ్‌ బరువు ఎంత ఉండాలి
1–2 తరగతులు: 1.5 నుండి 2 కిలోలు
3–5 తరగతులు: 2 నుండి 3 కిలోలు
6–8 తరగతులు: 3 నుండి 4 కిలోలు
9–10 తరగతులు: 4 నుండి 5 కిలోలు

బ్యాగ్‌ బరువును ఇలా తగ్గిద్దాం..
→ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్‌లు మాత్రమే బ్యాగ్‌లో ఉంచుకునేలా చూడాలి. 
లంచ్‌బాక్స్, వాటర్‌ బాటిల్‌ వంటివి విడివిడిగా ఉంచుకోవడం మంచిది.
→ పుస్తకాలను బైండింగ్‌ చేయించడం కంటే పేపర్‌తో అట్టలు వేయడం ద్వారా బరువు తగ్గుతుంది. 
→ పేరెంట్స్‌–టీచర్‌ సమావేశం జరిగినప్పుడు బ్యాగ్‌ బరువు విషయం స్కూల్‌ వారితో 
చర్చించాలి. వారికి తగిన సూచనలు చేయాలి.
→ మీ ఇంటికి స్కూల్‌ దగ్గరగా ఉంటే ఒక పని చేయొచ్చు. పిల్లల్ని ΄÷ద్దున్న తరగతుల పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా చూసి, లంచ్‌ బ్రేక్‌ సమయంలో మీరు వెళ్లి మధ్యాహ్నం తరగతుల పుస్తకాలు ఇవ్వొచ్చు. ఉదయం తరగతుల పుస్తకాలు మీరు తీసుకు రావొచ్చు. దీనివల్ల పిల్లలపై బ్యాగ్‌ భారం తగ్గుతుంది.
→ రేపు ఏయే పాఠాలు జరుగుతున్నాయో, ఏయే టీచర్లు సెలవులో ఉన్నారో, ఏ పుస్తకాలు అవసరమో ముందే పిల్లలకు చెప్పేలా ప్రణాళిక రూ  రూపొందించమని స్కూల్‌ యాజమాన్యాన్ని అడగండి. దీనివల్ల అవసరమైన పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 
→ చాలా పాఠశాలల్లో క్లాస్‌ వర్క్, హోం వర్క్‌ అని రెండు వేర్వేరు పుస్తకాలు వాడమని పిల్లలకు సూచిస్తుంటారు. దానికన్నా ఒకే పుస్తకంలో ముందువైపు క్లాస్‌వర్క్, వెనక వైపు హోం వర్క్‌ రాసేలా చూడమని టీచర్లకు సూచించొచ్చు. 
→ కొన్ని పాఠశాలల్లో రోజువారీ పాఠ్యపుస్తకాలు అక్కడే పెట్టి, హోం వర్క్‌ పుస్తకాలు మాత్రం ఇంటికి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అది అన్నిచోట్లా అమలుచేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు.


నో బ్యాగ్‌ డే 
వారానికి ఒకసారి గానీ లేదా నెలలో రెండు రోజులు గానీ పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ నుంచి స్వేచ్ఛ కల్పించడం ‘హ్యాపీనెస్‌ కర్రికులం’లో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలు కొన్ని ప్రభుత్వాలు చేసినా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. నిజానికి ఇది పిల్లలకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఆలోచన. స్కూల్‌ బ్యాగ్‌ లేని రోజు పిల్లలు ఆటలు పాటలు కథలు బొమ్మలు... వీటితో గడిపితే మానసిక వికాసం కలుగుతుంది. బ్యాగ్‌ మోత తప్పి వెన్నుకు విశ్రాంతి లభిస్తుంది. అయితే టీచర్లు తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచనను అంగీకరించరు. పిల్లలు అనునిత్యం పుస్తకాలు మోస్తూ పుస్తకాల్లో తలలు కూరి ఉంటేనే వాళ్ళు మంచిపిల్లలు అన్నది వారి భావన. 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)