విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?

Published on Tue, 03/19/2024 - 12:42

దేశంలో  ఒక పక్క సార్వత్రిక  ఎన్నికలు,  లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది.  మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న  పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది.  టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం.

తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై  వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు  ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ  99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో  జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు.  దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్‌పోజ్‌ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి  ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)