ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్‌! చివరికి..

Published on Tue, 06/17/2025 - 17:35

పిల్లల కోసం ఎన్నో జంటలు పరితపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, సరైన జీవన విధానం లేక పల జంటలు వంధ్యత్వంతో బాధపడతున్న తీరు వర్ణనాతీతం. ఇక ఐవీఎప్‌ వంటి సంతానసాఫల్యత విధానాలను ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరికి ఇవికూడా వర్కౌట్‌ కాక, మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. దాంతో అలాంటి జంటలు ఇక సరోగసి ద్వారా పిల్లలను పొందే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఇక్కడొక జంట ప్రయత్నించింది. వారు ఒకలా తలిస్తే భగవంతుడు మరోలా దీవించాడు. 

ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన రోహన్, కేట్‌ సిల్వాల జంట పిలల్లు లేక అల్లాడిపోయారు. ఆఖరికి ఐవీఎఫ్‌ని ఆశ్రయించిన ఫలితం శూన్యం. దాదాపు 20 సార్లు ఐవీఎఫ్‌ విధానంలో పెయిల్యూర్సేనే చవిచూసి విసగిపోయి సరోగసికి వెళ్లారు. సరిగ్గా ఆ తరుణంలో ఆ జంట బాధను చూసి దేవుడికే జాలి కలిగిందో ఏమో అనూహ్యంగా కేట్‌ సహజ పద్ధతిలో గర్భవతి అయ్యింది. అది కూడా 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌ అవ్వడం విశేషం. 

మరోవైపు సరోగసి ప్రయత్నం కూడా సఫలమైంది. అయితే ఆ దంపతులు ఎదుర్కొన్న ఐవీఎఫ్‌ ఫెయిల్యూర్స్‌ దృష్ట్యా రెండు గర్భాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ మహిళ కేట్‌ మందుగా బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత సరోగసి మదర్‌ అవా నాలుగు నెలలకు పండండి బిడ్డను ప్రసవించింది. 

అలా ఆ జంట 'అరుదైన ట్విబ్లింగ్స్‌'ని స్వాగతించారు. అంతేగాదు వారి పిల్లల జనన అంతరం గురించి చెబుతుంటే బంధువులు, స్నేహితులు అంతా విస్తుపోతున్నారని ఆనందంగా చెబుతోంది ఈ జంట. అంతేగాదు మా ఇద్దరి పిల్లలను చూసిన వారు కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. వారి జననగాథ విని వావ్‌..వాట్‌ ఏ మిరాకిల్‌ అంటూ మమల్ని అభినందిస్తుంటారని చెబుతున్నారు ఈ దంపతులు. 

చూడటానికి తమ పిల్లలు నిజమైన కలవలల్లా కనిపిస్తారని కానీ వారు వయసు అంతరం విని షాకవ్వుతారని చెబుతున్నారు. ఇలా నాలుగు నెలలు తేడాతో పుట్టిన కవలలను "కాలిఫోర్నియన్ కవలలు" అని పిలుస్తారట. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)