Breaking News

నిజమైన ప్రేమ ముందు..విధిసైతం తలవంచింది

Published on Tue, 07/25/2023 - 16:18

అన్ని అనుకున్నట్లు జరిగిపోవు. ఒక్కోసారి ఏవిధంగా ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మనం మళ్లీ కోలుకోలేనంత ప్రమాదంలో చిక్కుకుపోయి ఆగమ్యం గోచరంలా మన జీవితం ఉన్నప్పుడే.. మన వాళ్లేవరో మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మనవాళ్లో తెలుస్తుంది. మన కోసం తపించే వాళ్లెవరో అర్థమవుతుంది. అలాంటి ఘటనే ఓ వ్యక్తి లైఫ్‌లో చోటు చేసుకుంది. 

ఇరాన్‌కి చెందిన ప్రిస్టన్‌ కాబ్‌కి సెప్టెంబర్‌ 2022 తనేషా అనే ఆమెతో యంగేజ్‌మెంట్‌ అయ్యింది. జులై 22, 2023లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఇంకా ఒక్క నెలలో పెళ్లి ఉందనంగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు ప్రిస్టన్‌. సరిగ్గా ప్రిస్టన్‌ విధి నిర్వహణలో ఉండగా సడెన్‌గా ఫ్యాక్టరీలో కెమికల్‌ వెదచెంది.. అతనిపై పడిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో కెమికల్‌ దాదాపు  1500ల డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో ఉంది. ఆ దుర్ఘటనలో ప్రిస్టన్‌ శరీరీం సుమారు  32 శాతం కాలిపోయింది. మోచేతి చర్మం తన కళ్ల ముందే ఊడిపోయి ఎముకలు రావడం చూశాడు. ఇక ఆ రోజుతో తన జీవితం ముగిసిపోయిందనకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ప్రిస్టన్‌కి తెలియదు.

కళ్లు తెరిచి చూసేటప్పటికీ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. గాయాలు చాలా తీవ్రంగా అవ్వడంతో అతడిని ఆస్పత్రికి విమానంలో తరలించారు అధికారులు. ఆ ప్రమాదంలో ప్రిస్టన్‌ కాలి వేళ్లలో తొమ్మదిటిని, కుడి చేతి నాలుగు వేళ్లు, ఎడమ చేతి నేలుగువేళ్లను కోల్పయాడు. ఇక తనని తనేషా పెళ్లి చేసుకోదని అనుకున్నాడు. అసలు ఆ ఆలోచన తనలోకి రాకూడదని స్ట్రాంగ్‌గా అనుకున్నాడు. సడెన్‌గా ఆస్పత్రిలో ఉండే ఓ​ నర్సు వచ్చి కంగ్రాట్స్‌ మీరు అనుకున్న తేదినే పెళ్లి చేసుకుంటున్నారు అని చెబుతుంది.

ఒక్కసారిగా ప్రిస్టన్‌కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తనేషా ఆస్ప్రతి యాజమాన్యంతో మాట్లాడి  ప్రిస్టన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్న రూమ్‌నే వెడ్డింగ్‌ రూమ్‌గా మార్చేస్తుంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకోవాలనే స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యింది. ఆమె అనుక్నునట్లుగా అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసుకుంది. ప్రిస్టన్‌ సర్‌ప్రైజ్‌ చేస్తూ..నిన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఏది ఆపలేదు అని ప్రిస్టన్‌తో భావోద్వేగంగా చెబుతోంది. ఇంత ప్రతికూలత నుంచి మృత్యుంజయుడివై బయటకు వచ్చినందుకు ఇదే నేను నీకు ఇచ్చే విలువైన గిఫ్ట్‌ అని సంతోషంతో ముంచెత్తుంది. ఆ జంటను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి సమస్యలు ఎదురైనా..ఇదే స్ఫూర్తితో ఇద్దరు కలసి ఎదుర్కొండి అని ఆశ్వీరదించారు. 

(చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)