Breaking News

స్టార్స్ లక్కీ చార్మ్

Published on Sun, 02/16/2025 - 01:02

ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్‌ స్టయిలిస్ట్‌గా మారిన ఆమె విశేషాలు..

నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్‌లో ‘ఐ మేడ్‌ ఇట్‌’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు  చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)

ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్‌లో ఫ్యాషన్‌ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్‌ స్టార్‌ చేసింది. తొలి అవకాశమే అమితాభ్‌ బచ్చన్‌ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్‌’ సినిమాకు లీపాక్షి  కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌తో పాటు, డిఫరెంట్‌ కలర్‌ కాంబినేషన్స్‌తో మ్యాజిక్‌ చేసి, అమితాభ్‌ను సూపర్‌ చార్మింగ్‌గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ, బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఫేవరెట్‌ స్టయిలిస్ట్‌గా మారింది.

ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్‌ గేమ్‌ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్‌ ఫార్ములాను వివరించింది లీపాక్షి.

అందుకే, లీపాక్షితో స్టయిలింగ్‌ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్‌ ఇష్టపడతారు. అమితాభ్‌తోపాటు షారుఖ్‌ ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్‌ ఆర్యన్, సిద్ధార్థ్‌ కపూర్, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి బాలీవుడ్‌ స్టార్స్‌కు లీపాక్షీ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)