Breaking News

తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..?

Published on Wed, 08/16/2023 - 15:13

తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం!

తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు:

  • పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అ‍స్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.
  • అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
  • ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్‌ చిన్న ప్రేగు శోషక సామర్థా‍్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. 
  • రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది. 

తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు!
►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం. 
►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు
►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

(చదవండి: పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)