Breaking News

మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం

Published on Fri, 08/30/2024 - 17:32

మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్‌ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని  సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.

గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ‍్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ  మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది.  

మలబద్దకం రకాలు,  కారణాలు
అందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే  ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి.  అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ​​ఒత్తిడి పెంచుతుంది. దీంతో  బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.

సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు   కారణమవుతుంది. 

ఎపుడు అప్రమత్తం కావాలి?
జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం  ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మలబద్దకం-నివారణ 
ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా  జాగ్రత్తపడాలి. 
ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు  తీసుకోవాలి.
పుష్కలంగా నీరు తాగాలి. 
ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి  తేలికపాటి వ్యాయాయం, వాకింగ్‌  లాంటివి చేయాలి.
పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)