Breaking News

గురుబ్రహ్మ అమ్మ అవుతున్న వేళ...

Published on Fri, 07/18/2025 - 05:58

రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి. 
రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం. 
శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు. 
అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు. 
హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...

ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి. 

అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మాండీ జిల్లా థునాగ్‌ ప్రాంతమంతా  కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్‌లోని ‘కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది. 

హిమాచల్‌ ప్రదేశ్‌లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్‌ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క  పొంచి ఉన్న వరద ముప్పు! 

ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా  పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్‌ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.

అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!! 

అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్‌కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్‌ వైరల్‌ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్‌ బరస్ట్‌ టైమ్‌లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌లాగే!!

‘ఆ స్టూడెంట్స్‌ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)