Breaking News

అలాంటి మరణాలకు కాఫీతో చెక్‌ : ఎగిరి గంతేసే విషయం!

Published on Mon, 06/24/2024 - 17:54

కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం  వల్ల  అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి.  అయితే తాజా  అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి.  విషయమం ఏమిటంటే.

కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ  తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. 

కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను  కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్‌ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే  ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.

గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్‌ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది.   కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి.


 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)