Breaking News

కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ జెండాకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు..

Published on Thu, 06/19/2025 - 13:02

ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌ 2023 సందర్భంగా కోకాకోలా ఇండియా రీసైకిల్డ్‌ పెట్‌ ఇండియా జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జెండా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో చోటుదక్కించుకుంది. రీసైకిల్డ్ మెటీరియల్ వినూత్న ఆవిష్కరణ కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకుంది. 

ఈ మేరకు కోకా-కోలా ఇండియా అండ్‌ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్ అండ్‌ కమ్యూనికేషన్స్  సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా మాట్లాడుతూ.."ఈ ఆవిష్కరణకు సహకరించిన ‘గో రివైజ్’, ఐసీసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రీసైక్లింగ్ వ్యర్థాలను విలువైన వనరులుగా ఎలా మార్చవచ్చో చెప్పేందుకు ఈ జెండా నిదర్శనం. ఈ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తింపు అనేది మా పురురోగతని పునరుద్ఘాటించేలా గర్వపడే క్షణం". అని అన్నారు. 

ఇక గో రివైజ్ వ్యవస్థాపకుడు యష్ శర్మ ఇది పర్యావరణ బాధ్యతపై శక్తిమంతమైన స్ప్రుహని అందిస్తోంది. కాగా, కోకాకోలా ఇండియా మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ఈ జెండాను ఇలా వినూత్నంగా రూపొందించారు. దీన్ని 11వేల పోస్ట్-కన్స్యూమర్ PET బాటిళ్లతో రూపొందించారు. ఈ జెండాని భారత్‌లో ఆడే ప్రతి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ప్రారంభోత్సవ వేడుకలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. 

అంతేగాదు అక్టోబర్‌ 5, 2023 ప్రారంభమైన  ఈ పురుషుల ప్రపంచకప్‌ టోర్నమెంట్‌.. నవంబర్‌ 19 వరకు మొత్తం 19 స్టేడియంలలో సుమారు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు రీసైకిల్డ్‌ పెట్‌ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టి జాకెట్లను ధరించి, ప్రేక్షకులకు స్టేడియంను క్లీన్‌గా చూసుకోవడంపై అవగాహన కల్పించడం విశేషం.

(చదవండి: ఆ టీచర్‌ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్‌..! ఎవ్వరైనా ఫిదా అవ్సాల్సిందే)

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)