Breaking News

స్లాబ్‌లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...

Published on Sun, 04/12/2026 - 13:52

వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో  ఇల్లు  కొలిమిలా అనిపించడం మనకు చిరపరిచితమే.   ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతున్నా గాలి సరిపోనట్టుగా ఉక్కపోతగా అనిపిస్తుంది. దానికి కారణం...  ఇంటి పైకప్పు నుంచి వెలువడే వేడి , ఇంటి పైకప్పు రోజంతా వేడిని పీల్చుకుని, దానిని నెమ్మదిగా మన  నివాస స్థలంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అదే మనకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. 

తత్ఫలితంగా పుట్టే భరించలేని ఉక్కపోత నుంచి ఎయిర్‌ కండిషనర్లు ఉపశమనం కలిగిస్తాయి, కానీ అవి జేబుకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చిల్లులు పెడతాయి. ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. విద్యుత్ పై ఎక్కువ ఆధారపడకుండానే మన ఇల్లు చల్లగా మార్చగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఊహకే ఆనందాన్ని ఇచ్చే ఈ భావన వాస్తవంలో సాధ్యమేనా? అంటే  ఒక సులభమైన, కాలపరీక్షకు నిలిచిన శీతలీకరణ చిట్కా ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలు సాగించేవారు చెబుతున్నారు.
వంటికి... ఇంటికీ కూడా... ఫిల్లర్‌ స్లాబ్‌

ఈ సమస్యకు సమాధానం  సాదాసీదా మట్టి కుండల రూపంలోనే ఉంది. వంటిని చల్లబరిచే చల్లని నీటి కోసం ఫ్రిజ్‌ కు బదులు మట్టి కుండను ఎలా నమ్ముతున్నామో అలాగే ఇంటి చల్లదనానికి కూడా అవే ఉపకరిస్తాయి అని అంటోంది ఫిల్లర్‌ స్లాబ్‌ అనే నిర్మాణ శైలి. ఫిల్లర్‌ స్లాబ్‌ అనే పేరున్న ఈ పురాతన నిర్మాణ పద్ధతి ఓ సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. 

ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయడానికి ముందు మట్టి కుండలను పైకప్పు లోపల తలక్రిందులుగా ఉంచుతారు. నిర్మాణం గట్టిపడిన తర్వాత, ఈ కుండలు స్లాబ్‌ లోపల చిన్న గాలి గదులను సృష్టిస్తాయి. ఈ గదులు సహజమైన ఇన్సులేషన్‌గా పనిచేస్తాయి, పైకప్పు నుంచి ఇంటిలోకి వేడి బదిలీని నెమ్మదింపజేస్తాయి. తక్కువ కాంక్రీటు వాడకంతో, పైకప్పు మొదటి నుంచే తక్కువ వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది  దాని స్వభావ రీత్యా, వేడి చొచ్చుకుపోవడాన్ని మట్టి, నిరోధిస్తుంది. ఫలితం? ఎలాంటి యాంత్రిక జోక్యం లేకుండానే, ఇళ్లు చెప్పుకోదగిన రీతిలో చల్లగా ఉంటాయి, 

కొన్నిసార్లు ఇతర సాధారణ నిర్మాణ శైలి ఇళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ కూడా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా మట్టి కుండలు అందుబాటు ధర్లోనే లభిస్తాయి.  ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సాంకేతికత లేదు ఇది కేవలం సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన ఆలోచనాత్మకమైన రూపకల్పన మాత్రమే.  దీనివల్ల కలిగే ప్రయోజనాలు సౌకర్యానికి మించి ఉంటాయి. ఇళ్లలో వేడి తగ్గడం అంటే ఎయిర్‌ కండిషనర్లపై ఆధారపడటం తగ్గడం, దీనివల్ల విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు కార్బన్‌ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. 

కాలక్రమేణా, ఇది నివాస గృహాలకు మాత్రమే కాక భూగ్రహానికి కూడా గణనీయమైన రీతిలో మంచి మార్పును తీసుకురాగలదు. ఆసక్తికరంగా, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచే అవే గాలి బుడగలు శీతాకాలంలో వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి కూడా సహాయపడతాయి, తద్వారా నివాసాలు ఏడాది పొడవునా మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఆధునిక నిర్మాణం తరచుగా  వాతావరణానికి అనుగుణమైన రూపకల్పనను విస్మరిస్తుంది. మరోవైపు ఎయిర్‌ కండిషనర్ల వాడకం సర్వసాధారణం కాకముందే,  దేశవ్యాప్తంగా సాంప్రదాయ వాస్తుశిల్పం అప్పటికే తెలివైన, సుస్థిరమైన మార్గాలలో పర్యావరణానికి అనుగుణంగా మారుతోంది.

ఆధునిక సమస్యలకు  పరిష్కారాలు ఎల్లప్పుడూ కొత్తవిగానే ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఫిల్లర్‌ స్లాబ్‌ వంటి పద్ధతుల పునరుజ్జీవనం మనకు గుర్తు చేస్తుంది.  నగరాలు వేడెక్కుతూ, ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ, మనం నిర్మించే విధానంలో చేసే చిన్న మార్పులు, మనం జీవించే విధానంలో పెద్ద మార్పులకు దారితీయగలవు.  ఒక మట్టి కుండ వంటి అత్యంత సాధారణ చవకైన వస్తువు  చల్లదనాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే  పర్యావరణ నష్టాన్ని కూడా నివారించే శక్తి కలిగి ఉంది అని మనం గుర్తిస్తే...మన నివాసాలు బాగుంటాయి..భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది.

(చదవండి: స్నేహితుడి కోసం ఏకంగా రూ. 37 లక్షల లగ్జరీ కారులో..!)

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)