Breaking News

అమ్మ కోసం కుమార్తె ఆవిష్కరణ..కట్‌చేస్తే ఆమె..

Published on Sun, 06/29/2025 - 17:10

తల్లి కోసం ఆ కూతురు రూపొందించిన ఆవిష్కరణ తనకు ఇంతలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని కలలో కూడా ఊహించిలేదు ఆ కూతురు. అమ్మపై ఉన్న ప్రేమ తనలోని మేథస్సుని మేల్కొలిపి ఆవిష్కరణకు నాంది పలికేలా చేసింది చివరికి అదే తనను జపాన్‌ దేశానికి వెళ్లేలా చేసి..వార్తల్లో నిలిచేలా చేసింది.  

ఆ అమ్మాయే కృపాలి సునీల్‌. కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిగా కృపాలి సాధించిన అద్భుత విజయం ఇది. పదోతరగతి చదువుతున్న ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్న తన తల్లికి సాయం చేయాలని రూపొందించిన ఆవిష్కరణే ఇది. తల్లి వెన్నునొప్పి కారణంగా బరువైన వస్తువులు ఎత్తలేదు కాబట్టి వాటిని సులభంగా లిఫ్ట్‌ చేసేలా ఒక యంత్రాన్ని తయారు చేయాలని భావించింది. 

అనుకుందో లేదా వెంటనే బరువైనా వస్తువులను సులభంగా ఎత్తడంలో సహాయపడే పోర్టబుల్ ఎలివేటింగ్ పరికరాన్ని రూపొందించింది. ఆ ఆవిష్కరణ జపాన్ దేశాన్ని అమితంగా ఆవిష్కరించింది. అంతే ఈ నెల జూన్‌ 21 నుంచి 25 వరకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించిన సాకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు కృపాలికి ఆహ్వానం వచ్చింది. 

ఆమె INSPIRE MANAK ఎగ్జిబిషన్‌లో పాల్గొని తన ఆవిష్కరణను ప్రదర్శించడంతోనే ..కృపాలికి ఈ అపురూపమైన అవకాశం లభించింది. అంతేగాదు జపాన్‌కు వెళ్లిన 54 మంది ప్రతినిధుల బృందంలో మన కృపాలి సునీల్‌ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యార్థినిగా నిలవడం విశేషం. ఇక ఆ గర్వించదగ్గ క్షణంలో ఆమె తండ్రి ఇండాస్ కంపెనీ జనరల్ మేనేజర్ సునీల్‌ కుమార్‌ కృపాలి, వెల్లూరు ప్రభుత్వ హయ్యర్‌ స్కూల్‌ టీచర్‌ ధన్య నారాయణలు కూడా ఈ పాలుపంచుకున్నారు.

(చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)