Breaking News

చౌమహల్లా ప్యాలెస్‌ చూసొద్దాం రండి..!

Published on Fri, 10/10/2025 - 10:54

చార్మినార్‌: ఆసఫ్‌ జాహీల రాచరిక పాలనకు అద్దంపట్టే విధంగా ఉన్న పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌లో 8వ ఆసఫ్‌ ఝా, మాజీ హైదరాబాద్‌ నిజాం ముకర్రం ఝా బహదూర్‌ జయంతిని పురస్కరించుకుని అరుదైన ఛాయా చిత్రాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 6న ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన కుమారుడైన 9వ నిజాం అజ్మత్‌ ఝా బహదూర్‌ ప్రారంభించగా..7న నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు చౌమహల్లా ప్యాలెస్‌ భవనం, అందులోని నిజాం కాలం నాటి వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 

యూరోఫియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం.. 
చార్మినార్‌ కట్టడం నుంచి వాకబుల్‌ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్‌ యూరోఫియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌదం. ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్‌)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్‌–ఉద్‌–దౌలా–బహదూర్‌ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్‌ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్‌ మహల్, మఫ్తాబ్‌ మహల్, తహనియత్‌ మహల్, అప్జల్‌ మహల్‌ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్‌ మరింత శోభాయమానంగా మారింది. 

నిజాం ప్రభువుల నివాస గృహంగా.. 
ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్‌ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం విద్యుత్‌ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్‌ ప్రధాన గేట్‌ వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు.   

మ్యూజియంలో చూడదగ్గవి.. 
ఈ ఛాయా చిత్ర ప్రదర్శనతో పాటు నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్,  మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్‌ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్‌ కొనసాగుతోంది. 

ఎక్కడ: యూరోపియన్‌ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన చౌమహల్లా ప్యాలెస్‌ చార్మినార్‌ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్‌లో ఉంది. 
ఎలా వెళ్లాలి:  చార్మినార్‌ కట్టడం నుంచి లాడ్‌బజార్, ఖిల్వత్‌ చౌరస్తా ద్వారా ముందుకెళితే చౌమహల్లా ప్యాలెస్‌ భవనం 
కనిపిస్తుంది.      

ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్‌ యాక్షన్‌!

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)