చాక్లెట్లు అంటే పిచ్చి : కట్‌ చేస్తే..‌ ఏడాదికి కోటి రూపాయలు

Published on Sat, 03/15/2025 - 15:25

సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ  కొండమీది కోతినైనాకిందికి దింపవచ్చు.  వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడుకావచ్చు. ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు  చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్‌ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారితీసింది.  స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్‌  సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి సమయంలో  ప్రపంచమంతా  లాక్‌డౌన్‌ అయింది. చాలా మంది   ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు, కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తరువాత బిజినెస్‌గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ‘సారామ్’  అనే బ్రాండ్‌ను మొదలు పెట్టాడు.  కట్‌ చేస్తే దిగ్విజయ్ బిజినెస్ కోటి రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తోంది. సారామ్‌లో కుల్ఫీలు, కుకీలు  కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో  ఉన్నాడు.

ఉదయ్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూవిభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్‌లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్‌ విజయానికి బాటలు వేసింది.   తనకెంతో ఇష్టమైన చాక్లెట్‌ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.  అయితే తన ఆలోచనను తన సోదరుడు మహవీర్ సింగ్‌తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు గానీ చాక్లెట్‌ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత పట్టుసాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు.  ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకు ప్రతి కార్ సేల్‌లో ఒకే చాక్లెట్ బాక్స్‌ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్‌లను విక్రయించడానికి హోటల్ యజమానులు, కార్ షోరూమ్‌లను సంప్రదించాడు.

తొలి ఆర్డర్
అలా 2021లో  దిగ్విజయ్ ఒక  కార్ షోరూమ్ నుంచి వెయ్యి రూపాయల  చాక్లెట్ల మొదటి ఆర్డర్‌ను అందుకున్నాడు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. సారామ్‌ ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్‌గా మారిపోయింది. 2023 నాటికి, సారామ్ రెండు టన్నులకు పైగా చాక్లెట్‌ను విక్రయించింది.  ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు.  కేరళ ,తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్ ఐస్ ఆపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్‌లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు.

"నాకు చాక్లెట్టు అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు.  క్లాసెస్‌ ఆన్‌లైన్‌లో ఉండటంతో  చాలా సమయం దొరికింది.  వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే  YouTube ట్యుటోరియల్‌ ద్వారానే ఇది సాధించాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)