Breaking News

ఈగను చంపడంతో ..ఏకంగా కన్నేపోగొట్టుకున్నాడు..!

Published on Sat, 07/27/2024 - 10:38

వర్షాకాలం, లేదా తీపి వంటకాల ఘుమఘమలకు ఈగలు ముసురుతుంటాయి. వాటితో సమస్య అంత ఇంత కాదు. ఈగల వల్లే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయని మనందరికీ తెలిసిందే. వాటి నివారణ కోసం పలు క్రిమి సంహరక నివారణలు వాడుతుంటాం కూడా. అయినా ఎక్కడొక చోట ఒక్క ఈగ అయినా ఉంటూనే ఉంటుంది. ఉన్న ఒక్క ఈగ ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ముఖంపై వాలుతూ విసిగిస్తూ ఉంటుంది. చిర్రెత్తుకొస్తే చంపందేకు యత్నిస్తాం. ఇలానే  ఓ వ్యక్తి చేసి ఏకంగా కంటినే పోగొట్టుకున్నాడు. ఎలాగంటే..

వివరాల్లోకెళ్తే..చైనాలో ఈ దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో నివశిస్తున్న వ్యక్తికి ఒకరోజు ఈగ అతడి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది. దీంతో విసుగొచ్చి దాన్ని చంపాడు. అంతే ఒక గంట తర్వాత ఎడమ కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చేసింది. ఆ తర్వాత ఒకటే నొప్పిపుట్టడంతో తాళ్లలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు మందుల ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగవ్వకపోగ, పరిస్థితి మరింత దిగజారింది. వైద్య పరీక్షల్లో అతడికి కండ్లకలక వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. 

అంతేగాదు అతడి కంటి చుట్టూ ఉన్న ప్రాంతం వ్రణాలు వచ్చి ఇన్ఫెక్షన్‌ ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫెక్షన్‌ కాస్త మెదడుకు వ్యాపించే అవకాశం ఉందని భావించి ఎడమ కనుబొమ్మను మొత్తం తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈగలాంటి కీటకాలు బాత్‌రూమ్‌లు, బాత్‌టబ్‌లు, సింక్‌లు, కిచెన్‌లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తడిప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ కీటకాలు కళ్ల దగ్గరే తచ్చాడుతున్నప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. 

దాని వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. బదులుగా అది తాకిన ప్రాంతాన్ని పరిశుభ్రమైన నీరు లేదా సెలైన్‌ ద్రావణంతో కడగాలని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చైనా ప్రజలందర్నీ కలవరపాటుకి గురిచేసింది. ఈ విషయం నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు ఇది చాలా భయనకంగా ఉంది. తాము కూడా తరుచు బాత్రూంలలో ఇలాంటివి చూస్తామని, దేవుడు దయ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: అనంత్‌ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్‌ బ్రూచ్‌..ఆ డిజైన్‌లోనే ఎందుకంటే..!)

 

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)