Breaking News

ఈటింగ్‌ ఛాలెంజ్‌ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మృతి..అంత ప్రమాదమా?

Published on Mon, 07/22/2024 - 10:54

సోషల్‌ మీడియాలో ఇటీవల పలు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లు, డేరింగ్‌ ఛాలెంజ్‌లు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ వ్యక్తులు వరకు ప్రతిఒక్కరూ వాటిని చేసి చూపిస్తూ మరొకరికి ఛాలెంజ్‌ విసరడం వంటివి చేస్తారు. మొదట ఐస్‌ కూలింగ్‌ బకెట్‌ ఛాలెంజ్‌ అంటూ మొదలై అలా పలు రకాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఫిట్‌నెస్‌ పరంగానూ ఆరోగ్యపరంగానూ మంచివి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రమాదకర స్టంట్‌లే లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి రిస్కీ ఛాలెంజ్‌ ఫేస్‌ చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఏంటా ఛాలెంజ్‌? అంత డేంజరా అంటే..?

చైనాలోని పాన్‌ జియోటింగ్‌  అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఆన్‌లైన ఛాలెంజ్‌లను తీసుకోవడం అంటే మహా సరదా. అలాంటివి ఎ‍న్నో ఛాలెంజ్‌లు తీసుకుంది. అలానే ఇటీవల ఆమె ఈటింగ్‌ ఛాలెంజ్‌ తీసుకుంది. దీన్ని లైవ్‌లో చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఛాలెంజ్‌లో జియోటింగ్‌ పదిగంటలకు పైగా ఎక్కువసేపు తినవలసి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందికరమైనది వద్దు అని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు హెచ్చరించినా..పది కిలోలకు పైగా ఆహారాన్ని తినేందుకు ఉపక్రమించింది. 

ఒక దశలో ఆమె శరీరం హెవీ ఫుడ్‌ని తట్టుకోలేకపోవడంతో చివరికీ ఆమె మరణానికి దారితీసింది. అంతేగాదు పోస్ట్‌మార్టం రిపోర్టులో డా ఆమె కడుపు వైకల్యంతో మరణించిందని రావడం గమనార్హం. ఆమె కడుపులో జీర్ణకానీ ఆహారం పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో మరణించిందని పోస్టమార్టం రిపోర్టులో తేలింది. అతిగా తినడం ఇంత ప్రమాదకరమైనదా అంటే..

కొంతమంది రుచిలో మైమరిచి బాగా లాగించేస్తుంటారు. అలాగే అతని బ్రెయిన్‌ సైతం నచ్చిన ఫుడ్‌ని చూసి బాగా తినేలా ప్రేరేపించేస్తుంది. దీంతో కంట్రోల్‌ లేకుండా తింటాం. ఇలాంటప్పుడూ వెంటనే భయానక సమస్యలు రావుగానీ. పనిగట్టుకుని ఇలా పెద్ద మొత్తంలో ఆహారం తీసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా పెద్ద మొత్తంలో పొట్టలోకి ఆహారాన్ని పంపిస్తారో అప్పుడూ గ్యాస్ట్రిక్‌, ఆమ్లత్వం, కడుపునొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి ఎదురవ్వుతాయి.

అదీగాక జీర్ణశయం కూడా అంత మొత్తంలోని ఆహారాలను జీర్ణించుకోలేకపోతుంది. పైగా ఆ ఆహారం కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం లేదా అధిక బరువు వంటి వాటికి దారితీసి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పెద్ద మొత్తంలో తినాలన్నా ఆత్రుతలో సరిగా నమలితినం. దీంతో ఆహారం సాఫీగా జీర్ణం గాక పొట్ట బరువై ఉక్కిరిబిక్కరిగా అయిపోయి ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఆహారం విషయంలో మనసుపెట్టి బాగా నమిలి ఆస్వాదిస్తూ మితంగా తీసుకోవడమే మంచిదని లేదంటే లేనిపోని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. అంతేగా ఫుడ్‌ ఛాలెంజ్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.

(చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!)
 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)