Breaking News

5 వేల కిలోమీటర్ల దూరం నుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు

Published on Tue, 07/01/2025 - 11:21

చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్‌ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. 

టిబెట్‌లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్‌ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.

Apstar-6D ఉపగ్రహం ద్వారా  68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు  నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్‌ లాస్‌ లేకుండా చేయడమే కాదు,  24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం. 

ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో  కూడా రోబోటిక్  హ్యాండ్‌ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా   న్యూరాల్‌ నెట్‌వర్క్‌ను  వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్‌కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్‌ను కొనసాగిస్తూనే, డేటా లోడ్‌ను 62శాతం తగ్గించేందుకు  డైనమిక్ బ్యాండ్‌విడ్త్ కేటాయింపును వాడింది.

ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్‌ స్టోరీ వైరల్‌

రిమోట్‌,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స  సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని  ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్‌ జోన్స్‌,  ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్‌ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.
చదవండి: 900 గంటలు, 180 బటన్స్‌ : ఆమె స్పెషల్‌ వెడ్డింగ్‌ గౌను విశేషాలు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)