Breaking News

బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..

Published on Fri, 11/21/2025 - 17:44

కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండారు. అబ్బా దాని వాసనే కాఫీ తాగనివాళ్లను సైతం నోరూరిస్తుంది. అలాంటీ టేస్టీ కాఫీని ఇంత వెరైటీగా తాగాలనుకుంటే మాత్రం దెబ్బకు వాంతులు అవ్వడం కాయం. ఏమైంది అనుకోకుండి.. చైనా ఓ సరికొత్త కాఫీ టేస్ట్‌ని పరిచయం చేయనుంది. అదెలాగో తెలిస్తే ఛీ...య్యాక్‌ అనేస్తారు. 

బీజింగ్‌లోని ఒక మ్యూజియం కాఫీని మాములు వెరైటీగా కాఫీప్రియులకు అందిచడం లేదు. అది సర్వ్‌ చేసే విధానం చూస్తే బాబోయ్‌ అనిపించే రేంజ్‌లో..అత్యంత విలక్షణంగా అందింస్తోంది కస్టమర్లకు. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయ్‌ అబ్బా అని అనుకోకుండా ఉండరు ఎవ్వరైనా. ఇంతకీ ఎలాగంటే..బొద్దింకలను పైన జల్లి, ఎండిన పసుపు మీల్‌ వార్మ్‌లు కూడా జోడిస్తారు. ఆమ్యూజియం పేరు క్రిమీ మ్యూజియం అట. అందుకని ఆ పేరుకు తగ్గట్టు కస్టమర్లకు ఇలా సర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

అంతేకాదండోయ్‌ ఈ కాఫీ పేరు రోచ్ కాఫీ అట.కప్పు కాఫీ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 542లు పలుకుతుందట. ఇలాంటి కాఫీ కేవలం ఆ మ్యూజియంలోనే దొరకుతుందట. అలాగే ఇలాంటి వెరైటీ పానీయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. జీర్ణ రసంతో తయారు చేసిన పానీయాలు, హాలోవీన్ సందర్భంగా యాంట్‌(చీమల) డ్రింక్‌వంటి పలు విభిన్నడ్రింక్స్‌ ఉన్నాయట. అయితే ఆ మ్యూజియం వీటిని నిర్భయంగా తాగొచ్చని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని కస్టమర్లకు హామీ ఇవ్వడం మరింత విశేషం. 

ఆ పానీయాల తయారీకి సంబంధించిన ముడిసరకును మొత్తం సాంప్రదాయ చైనీస్ ఔషధ (TCM) మూలికా దుకాణం నుంచి కొనుగోలు చేస్తామని సదరు మ్యూజియ అధికారులు చెబుతుండటం గమనార్హం. అంతేగాదు చైనీస్ ఔషధం ప్రకారం..బొద్దింక పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడేతుందట. అలాగే ప్రొటీన్ అధికంగా ఉండే మీల్‌వార్మ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. కాగా, కొందరు చీమల పానీయం పుల్లని రుచి కలిగి ఉండగా, రోచ్ కాఫీ సాధారణ కాఫీలానే ఉందని చెబుతున్నారు.

(ఆ పెయింటింగ్‌ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!)

 

#

Tags : 1

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)