Breaking News

సోషల్‌ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరి

Published on Sat, 01/04/2025 - 12:44

సామాజిక మాధ్యమాల వినియోగంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు  సంబంధించి కీలక చట్టం రాబోతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్  డ్రాప్ట్‌  రూల్స్   ప్రకారం ఇకపై 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి  అవసరమని  స్పష్టం  చేస్తోంది.  భారతదేశం వెలుపల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలకు  ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా పేర్కొంది. 

ఈ  మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (జనవరి 3న) డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP) కోసం డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. నిబంధనలపై అభిప్రాయాన్ని/కామెంట్‌లను పంచుకోవడానికి మంత్రిత్వ శాఖ వాటాదారులను కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదన్న అభిప్రాయం, సోషల్‌ మీడియా వినియోగానికి కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలన్న వాదనల మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

 పిల్లల డేటా ప్రాసెసింగ్‌పై DPDP రూల్స్‌ ప్రకారం  చైల్డ్ (C) వినియోగదారు సోషల్‌మీడియా ఖాతాను సృష్టించాలనుకుంటే, డేటా ఫిడ్యూషియరీ (DF) తప్పనిసరిగా తల్లిదండ్రుల సమ్మతిని ధృవీకరించాలి.

 

ఈ సందర్భంలో, తల్లిదండ్రులు (P) తనను తాను గుర్తించి, DFతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ధృవీకరించిన గుర్తింపు, వయస్సు వివరాలతో రిజిస్టర్డ్ యూజర్ అని నిర్ధారిస్తారు. పిల్లల డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు, డీఎఫ్‌ తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల గుర్తింపు , వయస్సు రికార్డుల  విశ్వసనీయతను కూడా  నిర్ధారించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 18 వరకు ప్రజాభిప్రాయాల సేకరణకుద్దేశించిన ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన IDని  ధృవీకరించి, డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందుబాటులో ఉంచడానికి పిల్లల వయస్సును ధృవీకరించాలి. 

వివాదం
DPDP చట్టంలో  పిల్లల డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. పౌర సమాజం, పరిశ్రమ వర్గాలతో పాటు,  మెటా, గూగుల్‌ (Meta, Google) లాంటి  బిగ్ టెక్ సంస్థలు కూడా  ప్రభుత్వాన్ని  పిల్లలు, డేటా వినియోగం నిబంధనలపై మార్పులను కోరుతున్నాయి. ప్రధాంగా  ఈ నిబంధనలోని  వయస్సును  18 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువకు తగ్గించాలంటున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది.  ఫిబ్రవరి 18 తరువాత, ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు మరికొన్ని మినహాయింపులుండవచ్చని భావిస్తున్నారు.

పిల్లల డేటాను ప్రాసెస్‌పై పరిమితులు, మినహాయింపులు 
మానసిక ఆరోగ్య సంస్థ లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులు
అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులు
విద్యా సంస్థ
చైల్డ్ డే కేర్ సెంటర్
విద్యా సంస్థ

కాగా 2023 ఆగస్టులో పార్లమెంటులో ఆమోదించిన  DPDP  బిల్లు ఈ నిబంధనను నిర్దేశించింది. దేశ పౌరుల డిజిటల్ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన సంగతి తెలిసిందే.

 

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)