Breaking News

ఏం ట్విస్ట్‌..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..

Published on Fri, 11/15/2024 - 11:58

కొన్ని కథల్లో భలే గమ్మత్తైన ట్విస్ట్‌ ఉంటుంది. ఊహకే అతీతంగా ఉంటుంది. తీరా అసలు విషయం తెలిశాక అబ్బా.. పక్కపక్కనే ఉంటూ గుర్తించలేకపోయామా..! అనిపిస్తుంది​. అలాంటి విచిత్రమైన పరిస్థితే.. ఓ తల్లి కొడుకులకు ఎదురయ్యింది. ఇద్దరూ ఎదురుపడుతున్నా..ఒకరికి.. ఒకరూ.. ఏమవుతారో తెలియని స్థితి. ఏ విధి అయితే ఆ తల్లి బిడ్డలు వేరయ్యేలా చేసిందే.. అదే మళ్లీ అత్యంత విచిత్రంగా.. సరైన సమయంలో వారిని కలిపింది. ఆ తల్లికి స్వాంతన కల్పించింది. ఇంతకీ వారిద్దరి మధ్య విధి ఆడిన గమత్తైన కథ ఏంటంటే..

అమెరికాలోని చికాగోకి చెందిన 50 ఏళ్ల వామర్‌ హంటర్‌ తన ఇంటి సమీపంలో ఉండే 'గివ్ మీ సమ్ సుగా' అనే బేకరీ వద్దకు తరుచుగా వెళ్తుండేవాడు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన బేకరీ. కానీ సరదాకి కూడా హంటర్‌ ఈ బేకరీ తనదవుతుందని, త్వరలో తానే నడుపనున్నానని ఎప్పుడూ ఊహించలేదు హంటర్‌. 

ఇక హంటర్‌కి చిన్నతనం నుంచి ఇంట్లోని వాళ్లు తనవాళ్లు కారనే ఫీలింగ్‌ మనసులో బలంగా ఉంటుండేది. అయితే తనకు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడే.. తనని దత్తత తీసుకున్నారని, వాళ్లంతా తన కుటుంబసభ్యులు కారని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన కన్నతల్లి గురించి అన్వేషించడం ప్రారంభించాడు. 

ఈ విషయంలో కాలిఫోర్నియాకు చెందిన జన్యు శాస్త్రవేత్త గాబ్రియెల్లా వర్గాస్ హంటర్‌కి సహాయం చేశారు. అతడి కన్నతల్లి 'గివ్ మీ సమ్ సుగా' బేకరీ యజమాని 67 ఏళ్ల లెనోర్ లిండ్సే అని కనిపెట్టడమే గాక ఆమెకు హంటర్‌​ వివరాలు తోసహా ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో లిండ్సే బ్రెస్ట్‌ కేన్సర్‌కి చికిత్స తీసుకుంటోంది. 

చెప్పాలంటే కీమోథెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. తన పరిస్థితి ఎలా ఉన్నా లెక్కచేయక..వెంటనే ఆ జన్యు శాస్త్రవేత్త ఇచ్చిన ఫోన్‌నెంబర్‌కి కాల్‌ చేసి హంటర్‌తో మాట్లాడుతుంది. అయితే ఆ ఫోన్‌లో తాను తరచుగా విన్న.. కస్టమర్‌ గొంతులా ఉండటంతో ఆశ్యర్యపోతుంది.  ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక..లిండ్సే హంటర్‌ తన కొడుకేనని నిర్ధారించుకుని.. తనను ఎందుకు దత్తతకు ఇవ్వాల్సి వచ్చిందో హంటర్‌కి విరిస్తుంది. 

నిజానికి 1974లో హంటర్‌కి జన్మనిచ్చే సమయానికి లిండ్సేకి 17 ఏళ్లు. కుటుంబం తీవ్ర దారిద్య బాధల్లో కొట్టుమిట్టాడటంతో గత్యంతర లేక హంటర్‌ని దత్తతకు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉండి..అదికూడా తన తరుచుగా వెళ్లే బేకరీ.. యజమానే తన తల్లి అని తెలుసుకుని హంటర్‌ ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ బేకరిని నడుపుతున్నారు. పరిస్థితులు  ఆ తల్లి కొడుకులిని వేరే చేస్తే..విధి ఇద్దరిని పక్కపక్కనే ఉంచి.. సరైన సమయానికి చిత్రంగా కలిపింది కదూ..!. ఒకరకంగా ఆ తల్లికి ఈ వయసులో కొడుకు ఆసరా ఎంతో అవసరం కూడా.

(చదవండి: మోడలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్‌ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!)

 

 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)