ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు! ప్రపంచ రికార్డు

Published on Wed, 07/17/2024 - 11:01

ఛత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో 17వేల  మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్‌ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు  పాల్గొన్నారు. 

మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్‌ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి. 

ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)