సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేసేలా ప్లాస్టిక్‌కి చెక్‌..!

Published on Fri, 10/10/2025 - 12:30

ప్లాస్టిక్‌ భూతం అంటూ గగ్గోలు పెడుతున్నారు పర్యావరణ వేత్తలు. అన్నింటిలో ప్లాస్టిక్‌ ఆవరించేసిందంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడమే తప్ప, నిర్మూలించే దిశగా అడుగులు పడవు. కానీ ఈ మహిళలు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్లాస్టిక్‌ని నాటి సంప్రదాయం తిరిగి పురుడుపోసుకునేలా చెక్‌పెట్టేందుకు నాంది పలికారు. సాదికారతకు బీజం వేసేలా సంప్రదాయం, పర్యావరణ హిత సమ్మిళితంగా సాగిపోతున్న వారి దృఢ సంకల్పానికి హ్యాట్సాఫ్‌ అని చెప్పాల్సిందే. 

ఇదంతా చెన్నైలో చోటుచేసుకున్న అద్భుత చైతన్యంగా పేర్కొనవచ్చు. చెన్నై అనగానే మెరీనా బీచ్‌, ఆవిరి ఫిల్టర్‌ కాఫీ, పురాతన దేవాలయాలే కాదు..వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్‌కి చెక్‌పెడుతున్న ఈ మహిళలు కూడా ఇప్పుడు ఠక్కున గుర్తొస్తారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్న సాధికారతతో కూడిన పర్యావణ హిత ఉద్యమం యావత్తు దేశాన్ని ఆకర్షించేలా హైలెట్‌గా నిలిచింది. చేస్తున్న ప్రయత్నం చిన్నదైనా..ప్రభావం మాములుగా లేదు అనిపించుకున్నారు ఈ వనితలు. 

తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో భాగంగా మహిళా సంఘాలకు ఆకుపచ్చని ఎలక్ట్రిక్‌ ఆటోలు అందించి సాధికారత, సంప్రదాయాన్ని మిళితం చేసేలా పర్యావరణ హితంగా నడిపిస్తోంది. వీరంతా ఆకుపచ్చ మొబైల్‌ ఆటోల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధినే కాదు, పర్యావరణ సంరక్షణ కోసం తమ వంతు తోడ్పాటును అందిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

వాళ్లు ఈ మొబైల్‌ ఆటోల సాయంతో తాజా కూరగాయలను కస్టమర్లకు చేరవేయడమే కాదు, వాటిని పసుపు పచ్చ బ్యాగుల్లోనే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. పాతకాలం నాటి పసుపురంగు కాటన్‌ సంచులకు ప్రాణం పోసి నాటి సంప్రదాయన్ని గుర్తుచేయడమే కాదు..పర్యావరణ సంరక్షణకు బాటలు వేస్తున్నారు. అంతేగాదు కేవలం కూరగాయలు అమ్మడమే కాదు, ఈ ప్లాస్టిక్‌ భూతం మన జీవితాన్ని ఎలా కబిళిస్తుంది, ఎలా మన జీవితాల్లో స్థిరపడిపోయిందో వివరిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ చెన్నై మహిళలు. 

ఆకుపచ్చని ఆటోలతో పచ్చదన సంరక్షణ నినాదం తోపాటు తిరిగి ఉపయోగించే ఈ పర్యావరణ హిత పసుపు సంచులనే వాడుదాం అని విషయాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అందుకే ఈ సంచులను తమిళంలో  మంజపైస్(మళ్లీ వినియోగించే పసుపు సంచులు) అని పిలుస్తారు. ఇక ఈ ఆటోలు కూడా కాలుష్య రహిత ఎలక్ట్రానిక్‌ వాహనాలే కావడం విశేషం. 

మొత్తం ఈ ప్రాజెక్టు కార్యచరణ మొత్త పర్యావరణ సంరక్షణకే పెద్దపీట వేసేలా జాగ్రత్త తీసుకుని స్త్రీ సాధికారతను ప్రోత్సహించి..అందిరిచే ప్రశంలందుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది ఒకపక్క జీవనోపాధి, మరోవైపు సాధికారణ, సంప్రదాయ మిళిత పర్యావరణ హితానికి అంకురార్పణ చేయడమే గాక పెనుమార్పుకి నాంది పలికింది కదూ..!.

 

(చదవండి: భారత్‌ పిలిచింది..! కష్టం అంటే కామ్‌ అయిపోమని కాదు..)

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)