Breaking News

ఇలాంటి మేకప్‌ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్‌..!

Published on Mon, 01/13/2025 - 14:23

మేకప్‌ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్‌ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్‌ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్‌ తర్వాత వాళ్ల లుక్‌ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్‌ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్‌ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!

చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్‌ టోన్‌కు సరిపోయే మేకప్‌లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్‌ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్‌(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్‌ వేస్తారు చాలామంది. 

ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్‌ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్‌ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్‌తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్‌ టోన్‌కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్‌ వాష్‌ చేయకూడదు. మేకప్‌ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది.  

 

(చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్‌ ఏంటంటే..)
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు