Breaking News

చెఫ్‌ల వైట్‌ క్యాప్‌ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?

Published on Mon, 05/26/2025 - 15:33

చెఫ్‌లు అనగానే   తెల్లని యాప్రాన్‌, నెత్తిపైన పొడవాటి తెల్లటి టోపీ గుర్తు వస్తాయి. వంటవారు ధరించే అంచులు లేని తెల్లటి టోపీని  ఏమంటారో తెలుసా?  ప్రొఫెషనల్ కిచెన్ డ్రెస్ కోడ్ అంటే ఏమిటి? టోపీలో ఉండే మడతల గురించి తెలుసా? తెలుసుకోవాలని  ఉందా?  ఇవిగో వివరాలు

ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ చెఫ్‌లు ధరించే ఒక ఐకానిక్ టోపీని టోక్ అని పిలుస్తారు.  'టోక్' అనేది అరబిక్ పదం టోక్‌ లేదా టోక్ బ్లాంచ్  లా "తెల్ల టోపీ" అని అర్థం. చెఫ్ టోపీ , చరిత్ర మూలాలు పురాతన కాలం నాటివి. పురాతన కాలం అస్సీరియన్ సామ్రాజ్యం సుమారుగా 25వ శతాబ్దం BC నుండి 7వ శతాబ్దం BC వరకు ఉనికిలో ఉంది.అస్సీరియన్ నాగరికత సమయంలో, వంటవారు లేదా ఆహార తయారీలో పాల్గొన్న వ్యక్తులు నిర్దిష్ట తల కప్పులను ధరించారు అనడానికి ఆధారాలు ఉన్నాయి.

తొలినాళ్లలో, చెఫ్‌లు తమ జుట్టు ముఖాలకు అంటకుండా ఉండటానికి , వేడి నుండి తమ తలలను రక్షించుకోవడానికి సాధారణ వస్త్రంతో చేసిన స్కల్‌క్యాప్‌లు లేదా హెడ్‌స్కార్ఫ్‌లను ధరించేవారు. అయితే, పాక వృత్తి అభివృద్ధి చెంది, ప్రతిష్టను పొందే కొద్దీ, చెఫ్‌ల దుస్తులు కూడా రూపాంతరం  చెందుతూ  వచ్చాయి.   ప్రస్తుతం మనకు తెలిసిన చెఫ్ టోపీ 16వ శతాబ్దంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. కాలక్రమేణా వీరు ధరించే  టోపీ ఎత్తు, టోపీపై ఉండే మడతలు (ఫోల్డింగ్స్‌) పాకశాస్త్రంలో, చెఫ్‌లుగా  వారి నైపుణ్యం  అధికారానికి చిహ్నంగామారిపోయాయి. టోపీ ఎత్తు ,నిర్మాణం చెఫ్  ర్యాంక్  నైపుణ్య స్థాయిని సూచిస్తుంది.  టోపీకి ఎన్ని ఎక్కువ మడతలు ఉంటే, ఆ వంటవాడు అంత నిష్ణాతుడు , నైపుణ్యం కలిగినవాడు అని అర్థం.

ప్రఖ్యాత ఫ్రెంచ్ చెఫ్, మేరీ-ఆంటోయిన్ కారెమ్, ఆధునిక చెఫ్ టోపీని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 18వ శతాబ్దం చివరిలో- 19వ శతాబ్దం ప్రారంభంలో పాకశాస్త్ర మార్గదర్శకురాలైన కారెమ్, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఐకానిక్ పొడవైన, మడతల డిజైన్‌ను ప్రాచుర్యంలోకి  తెచ్చారు.

వేడిగా ఉండే వంటగది వాతావరణంలో చెఫ్ తల చల్లగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి. వెడల్పు అంచు ఒక కవచంగా పనిచేసి, జుట్టు, చెమట ఆహారంలోకి పడకుండా  అడ్డుకుంటుంది.  అంతేకాదు ఏదైనా మరకలు లేదా ధూళి వెంటనే కనిపిస్తుంది కాబట్టి, శుభ్రత , పరిశుభ్రతకు ప్రతీకగా  ఉండేలా తెల్ల రంగు టోపీలను ఎంపికచేశారు. నేటి కాలంలో కొంతమంది  చెఫ్‌లు వివిధ ఆచరణాత్మక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇతర రకాల తల కవరింగ్‌లను ఎంచుకుంటున్నప్పటికీ, పొడవైన టోక్ , పొడవాటి చేతుల తెల్లటి జాకెట్  అనేది ఐకానిక్‌ యూనిఫాంగా స్థిరపడింది అనడంలో సందేహంలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)