Breaking News

Glowing Skin నిగ నిగ లాడే చర్మ కాంతికి, పాలు, అలోవెరా ఇంకా..

Published on Wed, 01/31/2024 - 10:18

శీతాకాలపు గాలులు,మండే ఎండలు  మన చర్మ కాంతిని పాడు చేస్తాయి. జీవరహితంగా తయారు కావడం, పొడిబారడం, ముఖంపై  మొటిమలు అబ్బో..  ఈ   సమస్యలు లిస్ట్‌ చాంతాండంత. అందుకే మాయిశ్చరైజర్లు , క్రీమ్‌లను ఆశ్రయిస్తారు చాలామంది. అలా కాకుండా ఏ కాలంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా  మెరిసే చర్మాన్ని పొందడం  ఎలాగో తెలుసా?   

 కొబ్బరి నూనె.. బ్రౌన్‌ షుగర్‌
పొడిబారిన, నిస్తేజంగా ఉన్న చర్మానికి  కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయాకారంలో మసాజ్‌ చేయాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు నూనెలో కొద్దిగా బ్రౌన్‌ షుగర్‌ వేసి, కలిపి, ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిమంతం అవుతుంది. 

అలోవెరా 
చర్మకాంతికి మహత్తరంగా పనిచేసే జాబితాలో మొదటి వరసలో ఉంటుంది అలోవెరా. ముడతల నివారణకు పనిచేస్తుంది. అలొవెరా ఆకునుంచి తీసిన జెల్‌ను ముఖానికి, మేనికి పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగితే ΄÷డిబారడం సమస్య దరిచేరదు. 

పాలు
నిస్తేజంగా ఉన్న చర్మానికి పాలు మెరుపును తీసుకువస్తాయి. దూదిని పాలలో ముంచి, ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ΄ాలు, తెనె, శనగపిండి కలిపి ముఖానికి  ప్యాక్‌ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మకాంతి మెరగవుతుంది. 

తేనె 
తేనెలో ఔషధ గుణాలు ఎక్కువ. పొడి చర్మ సమస్యకు నివారిణిగా పనిచేస్తుంది. వేళ్లతో తేనెను అద్దుకొని, ముఖానికి రాసుకొని, మృదువుగా మసాజ్‌ చేసి ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

బొప్పాయి
మృతకణాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహాపడుతుంది. బొప్పాయి పండు చిన్న ముక్కను గుజ్జు చేయాలి. దీంతో తేనె వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. 

నీళ్లు 
ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగుతుంటే చర్మంలో ఉండే హానికారకాలు తొలగిపోయి తాజాదనం లభిస్తుంది.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు