Breaking News

జిమ్‌కి వెళ్లకుండానే 16 కిలోలు తగ్గింది, ఎలా?

Published on Mon, 11/04/2024 - 16:55

బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు.  కొందరికి బరువు తగ్గడం  అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్‌ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్‌, జాగింగ్‌ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు.  మరికొందరు ఇవన్నీ చేస్తారు.   జిమ్‌కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్‌ లాస్‌ జర్నీని ఇన్‌స్టాలో పోస్ట్‌  చేసింది. 

సాహిబా మొదట్లో 104  కిలోల బరువు ఉండేది.  దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు  ఎన్ని కేలరీల ఫుడ్‌ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది.  ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది.  ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది. 

ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్  వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది.  ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్‌కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్‌కు అనుగుణంగా  ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.

16 కిలోల బరువు తగ్గడానికి  స్టెప్స్‌ సాహిబా మాటల్లో
పూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను. 
కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను. 
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్  12:12 (12గం ఉపవాసం 12గం తినడం)
శరీరం దీనికి సహకరిస్తే  ఈ  ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.
డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం  వద్దు. 
16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం. 
ప్రోటీన్ , ఫైబర్  ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు  తక్కువ ఉన్న ఆహారం
దేన్ని  ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.
నీటిని తాగుతూ హైడ్రేట్ గా  ఉంచుకున్నారు. 

జిమ్‌కు వెళ్లకూడదని కాదు!
అయితే జిమ్‌కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది.

 

నోట్‌: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్‌ లాస్‌ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.  ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్‌ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.

ఇదీ చదవండి : డైట్‌ చేస్తున్నారా? బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ రాగుల ఉప్మా


 

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)