Breaking News

అల్లు అర్జున్‌ 'పుష్ప 2', విక్కీ కౌశల్‌ 'ఛావా'.. రెండు సినిమాల వెనక ఓ మహిళ!

Published on Sun, 02/23/2025 - 15:07

ఇటీవల బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీలుగా నిలిచినవి టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌ పుష్ఫ2, బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ ఛావా మూవీలు. ఈ రెండు మూవీల్లో హీరోలిద్దరివి ఓ డిఫరెంట్‌ లుక్‌. అదికూడా సహజసిద్ధంగా ఆయా పాత్రలో హీరోలు ఒదిగిపోయూలా చూపించాలి. అలా తెరపై కనిపించేలా చేసే మహిళా మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా..?. అది అలాంటి ఇలాంటి మేకప్‌ కాదు. అత్యంత విలక్షణమైన మేకప్‌ని వేస్తుందామె. అసలు ఆమెలాంటి మేకప్‌ ఆర్టిస్టులు దొరకడం కూడా అరుదు.. 

ఆమెనే ప్రఖ్యాత మహిళా మేకప్‌ అండ్‌ ప్రోస్థటిక్‌ ఆర్టిస్ట్‌ ప్రీతిషీల్‌ సింగ్‌ డిసౌజా. పుష్ప, చావా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, పుష్ప: ది రైజ్, మామ్, బాలా, ముల్క్, అంధాధున్, హైదర్, రంగూన్, రోమియో అక్బర్ వాల్టర్, బచ్చన్ పాండే, బంటీ ఔర్ బాబ్లి 2, చుప్ వంటి మూవీలలోని హీరోలందరికి మంచి లుక్‌ ఇచ్చింది ఆమెనే. 

ఆ మూవీలలో హీరోల పాత్ర చాలా విలక్షణమైనది అందుకు తగ్గట్టుగా ఆ రోల్‌లో వాళ్లు ఒదిగిపోయినట్లుగా సహజసిద్ధంగా కనిపించడం వెనుక ఆమె ప్రొస్థటిక్‌ మేకప్‌ నైపుణ్యం ఎంతో ఉంది. అంతేగాదు ఆమె ఉత్తమ మేకప్‌ విభాగంలో జాతీయ అవార్డుని అందుకుంది కూడా. ఆమె అందిరిలా మేకప్‌ వేయడం కాకుండా విలక్షణమైన ప్రొస్థటిక్‌ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించింది. 

ఇదేంటంటే సహజసిద్ధమైన బట్టతల, గాయాలు, అలాగే ఏజ్‌ని తక్కువ చేసి చూపించే మేకప్‌ నైపుణ్యం ఇది. ఈ నైపుణ్యం పదిమందికి నేర్పేలా తన భర్త డిసౌజాతో కలిసి తొలి మేకప్‌ అండ్‌ ప్రోస్థటిక్‌ స్టూడియో స్కూల్‌ని ప్రారంభించి వర్క్‌షాప్‌లు నిర్వహించింది. 

ఈ మేకప్‌లో ప్రోస్థటిక్‌ ముక్కలతో సహజత్వం ఉట్టిపడేలా చేస్తారు. ఇది విగ్‌ మేకింగ్‌ నుంచి బట్టతల క్యాప్స్‌, వృద్ధాప్యం, క్యారెక్టర్‌ మేకప్‌, కాలిన గాయలు, మచ్చలతో కూడిన ముఖం వరకు తదితరాలన్ని నిజంగానే వచ్చాయనే ఒరిజినాలిటిని ఉట్టిపడేలా చేస్తుంది ఈ మేకప్‌. 

ఈ నైపుణ్యాన్ని తస స్టూడియో ద్వారా ఔత్సాహిక విద్యార్థులకు నేర్పిస్తోంది. ఆచరణాత్మక శిక్షణను ఇస్తోంది ప్రీతిషీల్‌. నిజానికి ఆమె స్టార్‌ చేసిన ఈ వర్క్‌ షాప్‌ విజయవంతమైంది. ఈ కళను నేర్చుకునేందుకు దేశంలోని వివిధప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. అంతేగాదు ఆమె తన వర్క్‌షాప్‌కి ఇంతలా అనూహ్య స్పందన వస్తుందని ఊహించలేదని సంతోషంగా చెబుతోంది. 

తన కళ వాస్తవికతను తలపించే నైపుణ్యం అని, ఈ అపారమయైన జ్ఞానం, స్కిల్స్‌ని నలుగురికి అందించడమే తన లక్ష్యం అని అంటోంది. ఈ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలనేది తన ఆకాంక్ష అని చెబుతోంది. తన మేకప్‌ స్కూల్‌లో అత్యాధునిక సౌకర్యాల తోపాటు అనుభవజ్ఞులైన మేకప్‌ నిపుణలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.

(చదవండి: వర్క్‌ షేరింగ్‌తో ఆమె ముఖంలో చిరునవ్వులు తెప్పిద్దామిలా..!)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)